Bomb Threat Call: విశాఖ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు బాంబు బెదిరింపు కాల్ చ్చింది. ముంబై నుంచి విశాఖ వచ్చే ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టామని అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. దీంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు.
విశాఖ రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. రైలు S2లో అనుమానిత బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. బ్యాగ్ తెరిచి చూడగా బట్టలు, సబ్బులు, ఆధార్ కార్డ్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. S2 లో వదిలేసిన బ్యాగు యూపీకి చెందిన శ్రీరామ్ తివారీగా పోలీసులు గుర్తించారు. బాంబు లేదని నిర్ధారణకు రావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జీఆర్పీ, టాస్క్ ఫోర్స్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ట్రైన్ లో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు.
ALSO READ: UPSC Notification: డిగ్రీ అర్హతతో యూపీఎస్సీ నుంచి భారీ నోటిఫికేషన్.. అప్లికేషన్ ఫీజు రూ.25 మాత్రమే