Visakhapatnam Expressway: విశాఖపట్నం… త్వరలోనే దేశంలోని హైవే ట్రావెల్ మ్యాప్ పై మరో మెరుగైన మైలురాయిగా నిలవబోతోంది. కేవలం నౌకాశ్రయంతో కాదు, ఇప్పుడు రహదారులతో కూడా ఈ సిటీ చుట్టుపక్కల రాష్ట్రాలను దూసుకెళ్తోంది. తాజాగా, ఒడిశా రాష్ట్రంలో రాయ్ పూర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించబడిన తొలి సిక్స్ లేన్ ట్విన్ టన్నెల్ పూర్తయింది. ఇది కేవలం ఒక టన్నెల్ కాదు.. అభివృద్ధి అనే దారి ఆంధ్రప్రదేశ్‌వైపు బలంగా దూసుకెళ్తున్నదనే సంకేతం.
సుంకి ఘాట్ సమీపంలో 3,000 అడుగుల ఎత్తులో నిర్మాణం
ఈ ద్వితీయ టన్నెల్ వ్యవస్థ, ఒడిశాలోని కొరాపుట్ జిల్లా సుంకి ఘాట్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. టన్నెల్ 1 పొడవు – 3.42 కిలోమీటర్లు. టన్నెల్ 2 – 2.8 కిలోమీటర్లు. ఈ రెండింటూ విడివిడిగా గల డ్యూయల్ ట్యూబ్ టన్నెల్స్. అంటే రెండు వాహన మార్గాల కోసం రెండు వేర్వేరు టన్నెల్స్. రోడ్ ట్రాఫిక్‌కు ఇది ఒక పెద్ద ఉపశమనమే కాకుండా, అత్యాధునిక హైవే ప్రయాణానికి నాంది కూడా.
అత్యాధునిక సదుపాయాలు.. భద్రత ముందు స్థానంలో
ఈ టన్నెల్‌లలో అత్యాధునిక వెంటిలేషన్ వ్యవస్థ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు, సెంసార్ బేస్డ్ భద్రతా పరికరాలు అమలయ్యాయి. దీని నిర్మాణాన్ని ఢిల్లీకి చెందిన డినేశ్‌చంద్ర ఆగ్రవాల్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టింది. ఈ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక కీలక రహదారులు, టన్నెల్స్ నిర్మించిన అనుభవాన్ని కలిగి ఉంది.
విశాఖకు మరింత దగ్గరగా.. టూరిజానికి పుష్
ఈ టన్నెల్‌లు పూర్తవడం ద్వారా విశాఖపట్నం – రాయ్ పూర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. కోస్తా ప్రాంతాల నుంచి ఇజోల ప్రాంతాలకు, సముద్రతీరాల నుంచి అడవి ప్రాంతాలకు ప్రయాణించేవారికి ఇది ఓ బోనస్! విశాఖపట్నం మారిన మార్గాలు, ఈజీ కనెక్టివిటీతో ఓడల నుండి హైవేల వరకు అన్ని దారులూ తెరిచి ఉన్నాయనిపిస్తోంది.
Also Read: Multi train ticket: ఒకే టికెట్‌తో మల్టీ ట్రైన్స్ రైడ్… ఛాన్స్ కేవలం ఆ నగరానికే!
పర్యాటకానికి కొత్త అవకాశాలు
ఇప్పటికే విశాఖ టూరిజాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. బొర్రా గుహలు, అరకు వ్యాలీ, తాటి వనాలు, లాంబాసింగి, వాల్తేరు బీచ్.. ఇలా ఎన్నో ప్రత్యేక గమ్యస్థానాలతో ఉన్న విశాఖకు ఇప్పుడు జంట టన్నెల్ రూపంలో మరొక అద్భుతం దగ్గరవుతోంది. సుంకి ఘాట్ దారిలో ప్రయాణించేటప్పుడు ట్రావెలర్స్‌కి ఇప్పుడు భయంకర మలుపుల భాదలు లేవు, బదులుగా స్మూత్ డ్రైవ్, సేఫ్ టన్నెల్ ప్రయాణం!
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి మరో గర్వకారణం
రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి రైలు వెనకపడిందని చెబుతూ వచ్చిన విమర్శలకు ఇది చక్కటి సమాధానం. ఇప్పుడు విశాఖ ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులన్నీ.. బోగాపురం ఎయిర్‌పోర్ట్, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్‌లు.. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి ఒక ఆధునిక రూపం ఇస్తున్నాయి.
ఫ్యూచర్ రూట్స్ – కనెక్టివిటీ పరంగా రివల్యూషన్
ఈ ట్విన్ టన్నెల్స్ వల్ల ఒడిశా – ఆంధ్ర సరిహద్దుల్లో కొత్తగా బిజినెస్, ట్రేడింగ్, టూరిజం కార్యకలాపాలకు గేట్లు తెరుచుకోనున్నాయి. ఫ్యూచర్‌లో ఈ మార్గం మీద కార్గో ట్రాన్స్‌పోర్ట్ కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒడిశాలో ప్రారంభమైనా, ఇది అసలైన లాభం పొందబోయేది ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నమే. ఇకపై విశాఖ వెళ్లే ప్రతి రహదారి మరింత చక్కగా తయారవుతోంది. ఈ టన్నెల్స్ విశాఖను ఓ గేట్‌వే సిటీగా నిలిపేందుకు కీలక పాత్ర పోషించనున్నాయి.