విశాఖపట్నం నుంచి టూర్ ప్లాన్ చేస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. వైజాగ్ నుంచి నేరుగా రైళ్లో చేరుకునే కొన్ని అందమైన, సాంస్కృతిక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో తప్పకుండా సందర్శించాల్సిన 4 డెస్టినేషన్స్ ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఎలా వెళ్లాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ జగదల్‌పూర్, ఛత్తీస్‌గఢ్: ఈ ప్రాంతానికి 18515 నెంబర్ గల విశాఖపట్నం – కిరండూల్ ఎక్స్ ప్రెస్ ద్వారా చేరుకోవచ్చు. ఈ రైలు ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. బస్తర్ జిల్లా నడిబొడ్డున ఉన్న జగదల్ పూర్ గొప్ప సంస్కృతి, సహజ సౌందర్యంతో కూడిన గిరిజన ప్రాంతం. ఇక్కడ దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సుమారు 75 రోజుల పాటు ఇక్కడ దసరా వేడుకలు జరుగుతాయి. దట్టమైన అడవులు, జలపాతాలకు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ‘భారతీయ నయాగరా’గా పిలువబడే చిత్రకోట్ జలపాతాలు ఇక్కడే ఉంటాయి. కంగేర్ లోయలోని దట్టమైన అడవులు, గుహల గుండా నడక మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. స్పైసీ బస్తర్ థాలీ, మహువా ఆధారిత స్థానిక రుచికరమైన వంటకాలను ఆహా అనిపిస్తాయి.
⦿ తిరువనంతపురం, కేరళ: ఈ ప్రాంతానికి 22504 నెంబర్ గల కన్యాకుమారి SF వివేక్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లొచ్చు. ప్రతి సోమవారం విశాఖ నుంచి బయల్దేరుతుంది. కేరళ రాజధాని నగరం తిరువనంతపురం, అందమైన బీచ్‌లు, చారిత్రాత్మక దేవాలయాలు, గొప్ప సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఈ నగరం వైజాగ్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైళ్లో వెళ్లే అవకాశం ఉంటుంది. తిరువనంతపురంలోని ప్రపంచ ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. కోవలం బీచ్‌లో సర్ఫింగ్ చేయడంతో పాటు అలల్లో ఎంజాయ్ చెయ్యొచ్చు. కథకళి ప్రదర్శనను చూసి ఆనందించవచ్చు.
⦿ ఎర్నాకుళం, కేరళ: ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఎర్నాకుళం ప్రాంతానికి 13351 నెంబర్ గల ధన్‌బాద్ – అలప్పుజ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లొచ్చు. విశాఖ నుంచి ఈ రైలు రోజూ ఉంటుంది. విశ్వనగర వర్తమానాన్ని ప్రతిబింబించే సంస్కృతుల సమ్మేళనంతో ఆకట్టుకుంటుంది. ఈ నగరం గొప్ప చరిత్ర నిర్మాణ శైలి, కళ, వంటకాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్నాకుళం కొచ్చికి దగ్గరగా ఉండటం వైజాగ్ నుంచి వెచ్చే ప్రయాణికులకు బోనస్ గా ఉంటుంది. ఫోర్ట్ కొచ్చి వలస వీధులు, ఆర్ట్ గ్యాలరీలను చూడవచ్చు. కొచ్చి బ్యాక్ వాటర్స్ లో ఫెర్రీతో ఎంజాయ్ చేయండి. పావకుళం ఆలయాన్ని సందర్శించండి.
⦿ కోరాపుట్, ఒడిశా: ఈ ప్రదేశానికి 18514 నెంబర్ గల రైలులో విశాఖపట్నం – కిరండూల్ ఎక్స్‌ప్రెస్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రైలు రోజూ అందుబాటులో ఉంటుంది. కొరాపుట్ ఒడిశాలోని ఒక జిల్లా. పచ్చని లోయలు, జలపాతాలు, గిరిజన వాసరసత్వం ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతం ప్రశాంతమైన ప్రకృతి విహారయాత్రను అందిస్తుంది. మానవ శాస్త్ర అధ్యయనాలకు కేంద్రంగా ఉంది. చరిత్ర ప్రియులు తప్పకుండా సందర్శించాలి. దట్టమైన అడవుల మధ్య ఉన్న గుప్తేశ్వర్ గుహ ఆలయాన్ని సందర్శించవచ్చు. పిక్నిక్‌లు, బోటింగ్‌కు అనువైన సుందరమైన ప్రదేశం కోలాబ్ ఆనకట్టను చూడవచ్చు. స్థానిక తెగల గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించే గిరిజన మ్యూజియంను చూడవచ్చు. దుడుమా జలపాతాలను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. వెంటనే, ఈ ప్రాంతాల్లో టూర్ వేసేందుకు ప్లాన్ చేసుకోండి.
Read Also: ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్లాలా? ఇలా ఈజీగా ప్లాన్ చేసుకోండి!