రైలు ప్రయాణం ప్రయాణికులకు సంతృప్తిగా ఉండాలని IRCTC భావిస్తుంది. మీరు ఇటీవల చేసిన రైలు ప్రయాణం అసంతృప్తికరమైన, చెడు అనుభవాన్ని మీకు మిగిల్చిందా? అయితే ఇండియన్ రైల్వే నిబంధనల ప్రకారం మీరు మీ టికెట్ డబ్బులు తిరిగి పొందవచ్చు. ఈ మధ్యనే ఇండియన్ రైల్వేస్ నిబంధనలను సవరించింది. దాని మేరకు మీరు రిఫండ్‌కు అర్హులు అవుతారు.
రైలు ప్రయాణంలో మీకు జరిగిన చెడు అనుభవాన్ని చెప్పి మీరు రీఫండ్ క్లైయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏసీ పనిచేయకపోయినా, చెప్పిన సమయానికన్నా ఆలస్యంగా రైలు చేరుకున్న, రైలు దారి మళ్లింపు వంటి హఠాత్తు నిర్ణయాలు జరిగినట్టు అనిపించినా మీరు రిఫండ్‌కు అర్హులు అవుతారు.
TDR ఫైల్ చేయండి
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రయాణికులకు రైలు ప్రయాణం సంతృప్తిగా అనిపించకపోయినా, ఏ రకంగానైనా ఇబ్బంది పడినా… వారు టిక్కెట్ డిపాజిట్ ను తిరిగి పొందడానికి క్లెయిమ్ చేసుకోమని అనుమతినిస్తోంది. దీన్నే టిడిఆర్ ఫైల్ చేయడం అంటారు. ఎలా టిడిఆర్ ఫైల్ చేయాలో తెలుసుకోండి
IRCTC ప్రవేశపెట్టిన టిడిఆర్ ప్రక్రియ ద్వారా కస్టమర్లు తాము ప్రయాణం చేసిన రైలు టికెట్ డబ్బులను తిరిగి పొందవచ్చు. మీకు అనుకోకుండా రైలు తప్పిపోయినా లేదా చెప్పిన సమయానికన్నా ఎక్కువ ఆలస్యంగా రైలు వచ్చినా లేదా కోచ్ మారిపోయినా, ఇతర ఏదైనా ఇబ్బంది రైలులో ఎదురైనా… ఐఆర్సిటిసి వెబ్సైటు లేదా మొబైల్ యాప్ ద్వారా మీరు టిడిఆర్ ను సమర్పించి రిఫండ్ను క్లెయిమ్ చేసుకోవచ్చు.
TDRను ఇలా ఫైల్ చేయండి
ముందుగా మీరు ఐఆర్సిటిసి వెబ్ సైట్ లోకి లేదా మొబైల్ యాప్ లోకి లాగిన్ అవ్వండి. అందులో ‘మై అకౌంట్’ అనే ఎంపికకు నావిగేట్ అవ్వండి. అందులో ‘మై ట్రాన్సాక్షన్స్’ పై క్లిక్ చేయండి. అందులో ‘ఫైల్ టిడిఆర్’ అనే ఎంపికను ఎంచుకోండి. టిడిఆర్ ఫైల్ చేయాల్సినప్పుడు మీ టికెట్ పై ఉన్న పిఎన్ఆర్ నెంబర్ ను ఎంపిక చేసుకోండి. డ్రాప్ డౌన్‌లో కారణాన్ని వివరించండి. ఆ తర్వాత ‘ఫైల్ టిడిఆర్’ పై క్లిక్ చేయండి. కొన్ని సూచనలు వస్తాయి. ఆ సూచనలను నిర్ధారించి రైట్ క్లిక్ కొట్టండి. అంతే …మీరు టిడిఆర్ ఫైల్ చేసినట్టు సందేశం స్క్రీన్ పై కనిపిస్తుంది.
ఐఆర్సిటిసి ప్రయాణికులు అనేక పరిస్థితుల్లో టిడిఆర్ ను దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ టిడిఆర్ ను ధాఖలు చేయడానికి ఒక సమయం అంటూ ఉంటుంది. రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా వచ్చినా లేదా ఆ రైలులో మీరు ప్రయాణించకపోయినా టీడీఆర్ ను ఫైల్ చేయవచ్చు. అలాగే మీరు ప్రయాణిస్తున్న ట్రైన్ లో ఏసీ పనిచేయకపోయినా టిడిఆర్ ను ఫైల్ చేసుకోవచ్చు. రైలు హఠాత్తుగా దారి మళ్లించడం వల్ల మీరు రైలు తప్పిపోయినా కూడా మీరు టిడిఆర్ ఫైల్ చేయడానికి అర్హులే. కోచ్ పాడవడం వల్ల ప్రయాణికులు ఆ కోచ్ లో ప్రయాణం చేయలేకపోయినా కూడా టిడిఆర్ ఫైల్ చేయవచ్చు. అలాగే రైలు నిర్దేశిత గమ్యస్థానానికి మిమ్మల్ని చేర్చకుండా ముందే ఆగిపోయినా కూడా టిడిఆర్ ను ఫైల్ చేసే అవకాశం ఉంటుంది.