BigTV English

Producer Sirish : మీరే రామ్ చరణ్‌ను వాడుకున్నారు… నిర్మాతను ఏకిపారేస్తున్న మెగా ఫ్యాన్స్!

Producer Sirish : మీరే రామ్ చరణ్‌ను వాడుకున్నారు… నిర్మాతను ఏకిపారేస్తున్న మెగా ఫ్యాన్స్!

Producer Sirish :శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు (Dil Raju) సోదరుడిగా.. నిర్మాతగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు శిరీష్ (Sirish). తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పలు విషయాలపై స్పందిస్తూనే.. రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్ పై కూడా స్పందించి.. ఊహించని కామెంట్లు చేశారు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయితే కనీసం హీరో కానీ, డైరెక్టర్ కానీ ఎవరూ కూడా ఫోన్ చేసి స్పందించలేదు.. ఈ సినిమా వల్ల మాకు భారీ నష్టం కలిగింది.. అంటూ రామ్ చరణ్ పై నెగిటివ్ కామెంట్లు చేశారు శిరీష్. దీంతో ఇప్పుడు ఈయనను మెగా అభిమానులు ఏకిపారేస్తున్నారు. మీరే రామ్ చరణ్ ను వాడుకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


గేమ్ ఛేంజర్ ఫ్లాప్ పై రామ్ చరణ్ స్పందించలేదు – నిర్మాత

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ.. “గేమ్ ఛేంజర్ సినిమా పోయిన తర్వాత రామ్ చరణ్ కానీ ఇటు డైరెక్టర్ శంకర్ కానీ కనీసం కర్టసీ కోసమైనా సరే ఫోన్ చేసి మాట్లాడలేదు.” అంటూ రామ్ చరణ్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు.. సాధారణంగా సినిమా నష్టపోతే నిర్మాతలకు హీరోలు తమ రెమ్యూనరేషన్ లో సగం వెనక్కి ఇవ్వడం.. లేదా పూర్తి రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు.. ఇక రాంచరణ్ అలా ఏమైనా చేశారా? అని అడిగితే అలాంటి పరిస్థితికి మా సంస్థ ఇంకా దిగజారలేదు. మేము ఎవరిని అడగలేదు. మాకు ఎవరూ రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వలేదు.. అంటూ ఘాటుగా స్పందించారు. ఇప్పుడు ఈ విషయం మెగా అభిమానుల వరకు చేరడంతో నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నిర్మాత శిరీష్ ని ఏకిపారేస్తున్న మెగా ఫ్యాన్స్..

మెగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా..” ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. కానీ ముందే ఇచ్చిన మాట ప్రకారమే రామ్ చరణ్ దిల్ రాజుకు అవకాశం ఇచ్చాడు. అటు డైరెక్టర్ శంకర్ తో సినిమా సరిగ్గా చేయించుకోవాల్సిన బాధ్యత మీది (నిర్మాతలది). అలా కాకుండా హీరోను మాటలు అనడం ఏంటి? పైగా పాటలు అన్నీ కూడా 4 ఏళ్ల క్రితమే రికార్డు చేసినవి. ప్రస్తుతం ట్రెండ్ కు తగ్గట్టుగా వాటిని అప్డేట్ కూడా చేయలేదు. అలా నాలుగు సంవత్సరాల క్రితం రికార్డ్ చేసిన పాటలను డైరెక్ట్ గానే సినిమాలో పెట్టేశారు. దాంతో సినిమా నిడివి 4:30 గంటలు వచ్చింది. పైగా ఎవరు చెప్పినా వినలేదు. అప్పట్లో ఈ ట్రిమ్ చేయడం వల్ల డైరెక్టర్ – నిర్మాత మధ్య మనస్పర్ధలు వచ్చాయనే వార్త కూడా ఇండస్ట్రీలో వినిపించింది కదా.. అది మీ వరకు రాలేదా.. ఇలా ఇవన్నీ పెట్టుకుని మా హీరో పై ఇలాంటి కామెంట్లు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు” అంటూ నిర్మాతను మెగా ఫాన్స్ ఏకీపారేస్తున్నారు.

బాలయ్య అన్ స్టాపబుల్ షోలో కూడా..

అంతేకాదు బాలయ్య అన్ స్టాపబుల్ షోలో దిల్ రాజు చేసిన కామెంట్లను కూడా మెగా అభిమానులు గుర్తు చేస్తున్నారు.
“రామ్ చరణ్ తో వేరే సినిమా చేయాల్సి ఉంది. కానీ అది పక్కన పెట్టి ఈ గేమ్ ఛేంజర్ సినిమా చేయాలని అనుకున్నాము” అంటూ దిల్ రాజు తెలిపారు. ఈయన మాటలను బట్టి చూస్తే ఈ సినిమాను, కూడా ఈ సినిమా కథను గట్టిగా నమ్మారు కాబట్టే ముందుగా వాళ్ళు అనుకున్న కథను పక్కనపెట్టి మరీ ఈ గేమ్ ఛేంజర్ సినిమాని నిర్మించారు దిల్ రాజు. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఇలా నోటికి వచ్చినట్లు గ్లోబల్ స్టార్ అని కూడా చూడకుండా మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు.. అంటూ నిర్మాత శిరీష్ పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై నిర్మాత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ALSO READ:Kiran Abbavaram: కొడుకుతో మధుర క్షణాలు.. ఎంత చబ్బీగా ఉన్నాడో చూసారా?

Related News

Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం

Cine Workers Strike : సినీ కార్మికుల సమ్మెలో బిగ్ ట్విస్ట్… నోటీసులు జారీ చేసిన లేబర్ కమిషన్

Heroine: ఆ ఎమ్మెల్యే హోటల్‌కి రమ్మంటున్నాడు.. హీరోయిన్‌ సంచలన ఆరోపణలు

Andhra King Taluka: రిలీజ్ డేట్ ఫిక్స్, హే రామ్ ఒక్క హిట్ ప్లీజ్

Chiranjeevi: చిరంజీవి గొప్ప మనసు.. ఆ హీరో అప్పులు తీర్చేసిన మెగాస్టార్‌..

Prabhas: మహాభారతంలోని పాత్రతో ప్రభాస్ మూవీ… డార్లింగ్‌కు సరిగ్గా సెట్!

Big Stories

×