Western Railway Cancels Trains: వెస్ట్రన్ రైల్వే పరిధిలో 163 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే వెల్లడించింది. ఈ మేరకు వెస్ట్రన్ రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. కండివాలి- బోరివాలి స్టేషన్ల మధ్య బ్రిడ్జి నంబర్ 61 రీ-గిర్డరింగ్ పనులు చేసేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఏప్రిల్ 26, 2025 (శనివారం) మధ్యాహ్నం 1 గంట నుంచి ఏప్రిల్ 27/28, 2025 ఉదయం 12 గంటల వరకు 35 గంటల పాటు పనుల కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ పనుల కారణంగా మల్టిపుల్ మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ల రాకపోకలు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని వెల్లడించారు. ఏప్రిల్ 26న కొన్ని సబర్బన్ సర్వీసులు రద్దు చేశారు. దాదాపు 73 సబర్బన్ సర్వీసులు క్యాన్సిల్ చేశారు. ఏప్రిల్ 27న దాదాపు 90 సబర్బన్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రైల్వే మెగా బ్లాక్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెస్ట్రన్ రైల్వే వెల్లడించింది.
రైళ్ల రద్దు గురించి వెస్ట్రన్ రైల్వే ఏం చెప్పిందంటే?
కండివాలి- బోరివాలి స్టేషన్ల మధ్య బ్రిడ్జి నంబర్ 61 రీ-గిర్డరింగ్ వర్క్ చేస్తున్నామని పశ్చిమ రైల్వే తెలిపింది. 35 గంటల మేజర్ బ్లాక్‌ను ఐదవ లైన్, కార్షెడ్ లైన్, కండివాలి ట్రాఫిక్ యార్డ్ లైన్ లో ప్రకటిస్తున్నట్లు పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ వెల్లడించారు. “బ్లాక్ పీరియడ్ లో ఐదవ లైన్ లో నడుస్తున్న సబర్బన్ సర్వీసులు, మెయిల్/ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఫాస్ట్ లైన్లలో నడుస్తాయి. కొన్ని మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రభావితమవుతాయి. కొన్ని సబర్బన్ సర్వీసులు రద్దు చేయబడతాయి. ఏప్రిల్ 26న దాదాపు 73 సబర్బన్ సర్వీసులు క్యాన్సిల్ అవుతాయి. ఏప్రిల్ 27న దాదాపు 90 సబర్బన్ సర్వీసులు రద్దు చేయబడుతాయి” అని వివరించారు.
ప్రభావితం అయ్యే మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు
⦿ ఏప్రిల్ 25,26న 19418 నెంబర్ గల అహ్మదాబాద్ – బోరివలి ఎక్స్ ప్రెస్ రైలు వాసాయి రోడ్ దగ్గర కాసేపు ఆగుతుంది. వాసాయి రోడ్- బోరివలి మధ్య పాక్షికంగా క్యాన్సిల్ చేయబడుతుంది.
⦿ ఏప్రిల్ 27న 19417 నెంబర్ గల బోరివలి – అహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్ రైలు వాసాయి రోడ్ వరకు వెళ్తుంది. వాసాయి రోడ్- బోరివలి మధ్య పాక్షికంగా రద్దు చేయబడుతుంది.
⦿ ఏప్రిల్ 26, 27న 19425 నెంబర్ గల బోరివలి – నందూర్బార్ ఎక్స్‌ప్రెస్ రైలు వాసాయి రోడ్ వరకు వెళ్తుంది. వాసాయి రోడ్- బోరివలి మధ్య పాక్షికంగా రద్దు చేయబడుతుంది.
⦿ ఏప్రిల్ 26న నడిచే 19426 నెంబర్ గల నందూర్బార్ – బోరివలి ఎక్స్‌ప్రెస్ రైలు వాసాయి రోడ్ వరకు వెళ్తుంది. వాసాయి రోడ్- బోరివలి మధ్య పాక్షికంగా రద్దు చేయబడుతుంది.
⦿ అటు ఇదే సమయంలో ప్రయాణీకుల సౌలభ్యం కోసం, పశ్చిమ రైల్వే ప్రత్యేక ఛార్జీలపై నడిచే నాలుగు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
ప్రత్యేక రైళ్లు వివరాలు:
⦿ రైలు నంబర్ 09001/09002 ముంబై సెంట్రల్ – ఖతిపుర సూపర్ ఫాస్ట్ (మూడు వారాల) స్పెషల్
రైలు నంబర్ 09001 ముంబై సెంట్రల్ – ఖతిపుర స్పెషల్ రైలును మే 26 వరకు పొడిగించారు. రైలు నంబర్ 09002 ఖతిపుర – ముంబై సెంట్రల్ రైలును మే 27 వరకు పొడిగించారు.
⦿ రైలు నంబర్ 09003/09004 ముంబై సెంట్రల్ – ఢిల్లీ సూపర్‌ఫాస్ట్ (రెండు వారాల) స్పెషల్
రైలు నంబర్ 09003 ముంబై సెంట్రల్ – ఢిల్లీ స్పెషల్ రైలును జూన్ 27 వరకు పొడిగించారు. రైలు నంబర్ 09004 ఢిల్లీ – ముంబై సెంట్రల్ రైలును జూన్ 28, 2025 వరకు పొడిగించారు.
⦿ రైలు నంబర్ 09007/09008 వల్సాద్ – ఖతిపుర (వారం వారీ) స్పెషల్
రైలు నంబర్ 09007 వల్సాద్ – ఖతిపుర స్పెషల్ రైలును మే 22, 2025 వరకు పొడిగించారు. రైలు నంబర్ 09008 ఖాతిపుర – వల్సాద్ స్పెషల్ రైలును మే 23, 2025 వరకు పొడిగించారు.
⦿రైలు నంబర్ 09425/09426 సబర్మతి – హరిద్వార్ (ద్వై-వారం) స్పెషల్ రైలు
రైలు నంబర్ 09425 సబర్మతి – హరిద్వార్ స్పెషల్ రైలును జూన్ 29 వరకు పొడిగించారు. రైలు నంబర్ 09426 హరిద్వార్ – సబర్మతి స్పెషల్ రైలును జూన్ 30 వరకు పొడిగించారు.
Read Also: సమ్మర్ రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం, అందుబాటులోకి మరిన్ని ప్రత్యేక రైళ్లు!