Personal Loans:ఈ రోజుల్లో పర్సనల్ లోన్ పొందాలంటే ఎంత తతంగముంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సిబిల్ సోర్, కంపెనీలోని జాబ్ పేస్లిప్‌లు ఇవ్వాలి, డాక్యుమెంట్స్, షూరిటీ చెప్పుకుంటూ పోతే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మళ్లీ డబ్బులు కూడా త్వరగానే జమచేయరు. దానికోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ డబ్బులు జమ అయినా.. భారీ మొత్తంలో వడ్డీ రేటు ఉంటుంది. ఓ మధ్య తరగతి కుటుంబం ఇలా లోన్ పొందాలంటే కష్టాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు శుభవార్తం చెప్పింది.
ఇక, ఇప్పటి నుంచి పర్సనల్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్. లోన్ యాప్ వేధింపులకు ఇక పులిస్టాప్ పెట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల ఇప్పుడు కేవలం 3 నుంచి 4 గంటల్లో లోన్ పొందే అవకాశం ఉంది. అది కూడా తక్కువ వడ్డీకే పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఈ సేవలకు సంబంధించిన సేవలను ఇప్పుడు ఓ సారి తెల్సుకుందాం.
కొంత మంది ఎమర్జెన్సీగా డబ్బు కావాలనుకునే వారు ఎక్కువ వడ్డీతో ప్రైవేట్ యాప్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇవి ఎంత డేంజరో ప్రైవేట్ యాప్‌ల నుంచి లోన్ తీసుకున్నవారిని అడిగి చూస్తే తెలుస్తుంది. అయితే ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం త్వరగా రుణాలు అందించనున్నాయి. మీ అవసరానికి అనుగుణంగా కేవలం 3 నుంచి 4 గంటల్లోనే వ్యక్తిగత రుణాలను పొందవచ్చు. ఇలా రుణాలు పొందడానికి ఎలాంటి డాక్యుమెంట్లు, జాబ్ పే స్లిప్స్, షూరిటీలు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ త్వరిత వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఈ డిజిటల్ యుగంలో, ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా, తక్కువ సమయంలో ప్రభుత్వం నుంచి పర్సనల్ లోన్ పొందవచ్చు.
Also Read: IITGN Jobs: బీటెక్ పాసైన వారికి శుభవార్త.. ఈ ఉద్యోగం కొడితే నెలకు RS.2,00,000 పైనే..
ఈ విధంగా రుణం పొందాలంటే ముందుగా మీరు ప్రభుత్వ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించి మీ KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. KYCలో మీ డాక్యుమెంట్లను, మునుపటి రుణ వివరాలు ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం పూర్తయిన తర్వాత 30 నిమిషాల నుండి 4 గంటల్లో డబ్బు మీ ఖాతాలో జమ చేస్తారు. మన ఇష్టారీతిన EMIని మనమే నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల మీ బడ్జెట్‌కు అనుగుణంగా రుణాన్ని సులభంగా తిరిగి చెల్లించవచ్చు. ఆన్‌లైన్‌లో రుణం తీసుకునేటప్పుడు, నమ్మకమైన సంస్థలను ఎంచుకోవాలి. ఇటీవల ఆర్థికపరమైన మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేటును జాగ్రత్తగా చూసుకుని, మోసగాళ్ల బారిన పడకుండా చూసుకోవాలి. మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వెబ్‌సైట్‌లకు చెప్పకూడదు.