BigTV English

Railway Tracks: రైల్వేలో ముందు కొత్త ట్రాక్ వేయరు, ఎందుకో తెలుసా?

Railway Tracks: రైల్వేలో ముందు కొత్త ట్రాక్ వేయరు, ఎందుకో తెలుసా?

Indian Railways: గత కొంతకాలంగా దేశంలో వందలాది కిలో మీటర్ల మేర రైల్వే ట్రాక్ ల నిర్మాణం జరుగుతున్నది. జమ్మూకాశ్మీర్ సహా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక రైల్వే ట్రాక్ నిర్మించే సమయంలో అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అన్నింటికంటే ముఖ్యం.. తొలుత ట్రాక్ ఏర్పాటు చేసే సమయంలో కొత్త ట్రాక్ వేయరు. దాని స్థానంలో ఫిష్ ప్లేటేడ్ ట్రాక్ వేస్తారు. అంటే పాత పట్టాలతో కూడిన ట్రాక్ కు నిర్మిస్తారు. ఆ తర్వాత వీటిని తీసేసి కొత్త ట్రాక్ ను నిర్మిస్తారు. ఒకేసారి కొత్త ట్రాక్ వెయ్యొచ్చు కదా? అదనపు ఖర్చు ఎందుకు దండగ అని చాలా మంది భావిస్తారు. కానీ, దీనికి ఓ కారణం ఉంది. ఇంతకీ అదేంటంటే..


రైలు పట్టాల తరలింపు కోసం ఫిష్ ప్లేటేడ్ ట్రాక్ నిర్మాణం

కొత్తగా వచ్చే రైలు పట్టాలు ఒక్కోటి 250 మీటర్లు ఉంటాయి. వీటిని రోడ్డు మార్గం ద్వారా తరలించడం అనేది సాధ్యం అయ్యే పని కాదు. అందుకే, ప్రత్యేమైన రైలు ద్వారా వీటిని తీసుకొస్తారు. ఈ రైలు వచ్చేందుకు ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ వేస్తారు. ఈ ట్రాక్ మీద 20 RP బీటెడ్ ట్రైన్ వస్తుంది. ఈ రైలులో మాత్రమే రైలు ప్యానెల్స్ ను తీసుకొస్తారు. ఈ పట్టాలు వచ్చిన తర్వాత.. దాన్ని తొలగించి కొత్త ట్రాక్ ను వేస్తారు. ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ నిర్మాణం అనేది పట్టాలను తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నంలో భాగం భావిస్తారు రైల్వే అధికారులు.


ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటి

భాతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతున్నది. సుమారు లక్ష కిలో మీటర్లకు పైగా ఉన్నా రైల్వే లైన్ల మీద నిత్యం 20 వేలకు పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. రోజుకు సుమారు 2.5 కోట్ల మంది ప్రయాణీకులు ఈ రైళ్ల ద్వారా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. తక్కువ ఖర్చులో ప్రయాణీకులకు ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించడంతో ఎక్కువగ మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతుంటారు.

దశాబ్దకాలంగా రైల్వేలో భారీ పురోగతి

ఇక గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వే గణనీయమైన పురోగతి సాధిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను  పునర్నిర్మించడంతో పాటు అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నది. సరికొత్త రైల్వే డిజవిజన్లను ఏర్పాటు చేస్తున్నది. వందేభారత్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లు భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చివేశాయి. ప్రయాణీకులు అత్యాధునికి వసతులు కల్పించడంతో పాటు వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. అటు నమోభారత్ రైళ్లు మెట్రో ప్రయాణాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. హైడ్రోజన్ రైళ్లు, బుల్లెట్ రైళ్లను ప్రజలకు పరిచయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు భారతీయ రైల్వే సంస్థ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది.

Read Also: రైల్వేలో W/D బోర్డులు కనిపిస్తాయి.. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా?

Related News

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

Big Stories

×