OTT Movie : కొరియన్ సినిమాలకు ప్రస్తుతం టాలీవుడ్లో ఎంతటి ఆదరాభిమానాలు దక్కుతున్నయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటిటిలో వచ్చే కొరియన్ సినిమాలను మిస్ అవ్వకుండా చూస్తున్నారు ఓటీటీ మూవీ లవర్స్. అయితే ఇటీవల కాలంలో ప్రభాస్ విలన్ గా పాపులర్ అయిన కొరియన్ నటుడు డాన్ లీ నటించిన ఒక బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సైఫై అండ్ మోస్ట్ వైలెంట్ మూవీ ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? మూవీ కథ ఏంటో తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
కొరియన్ పాపులర్ యాక్టర్ డాన్ లీ గురించి ఇప్పటికే చాలామంది టాలీవుడ్ మూవీ లవర్స్ కి తెలుసు. ట్రైన్ టు భూషణ్ అనే పాపులర్ కొరియన్ మూవీ తో ఆయన ముందుగా పరిచయమయ్యారు. అయితే ఇటీవల కాలంలో స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కి విలన్ అంటూ డాన్ లీ పేరు మార్మోగిపోయింది. అప్పటినుంచి ఆయన ఫేస్ ఎక్కడ కనిపించినా సరే ఆ సినిమాను వదలకుండా చూస్తున్నారు టాలీవుడ్ మూవీ లవర్స్. అలా కొరియన్ సినిమాలతో పాటు సైఫై, యాక్షన్ త్రిల్లర్ సినిమాలను బాగా ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఒక్కసారి చూశారంటే వర్త్ వాచింగ్ మావా అంటారు. అలా ఉంటుంది ఈ మూవీ. కావలసినంత వైలెన్స్ తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంటుంది ఈ సినిమాలో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మూవీ పేరు ‘బ్యాడ్ ల్యాండ్ హంటర్స్‘ (Bad Land Hunters). ఈ కొరియన్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఆల్మోస్ట్ అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
ముందుగా ఈ మూవీ చనిపోయిన తన కూతుర్ని బ్రతికించుకోవాలని తపనపడే డాక్టర్ దగ్గర నుంచి మొదలవుతుంది. అతను పలు ప్రయోగాలు చేసి కూతురుని బతికించుకోవడానికి ఓ మందును కనిపెడతాడు. అంతలోనే ఆర్మీ అధికారులు వచ్చి అతన్ని ఆపడం, భూకంపం వచ్చి ఆల్మోస్ట్ ప్రపంచం అంతం కావడం లాంటివి జరుగుతాయి. ఇదంతా అయ్యాక అక్కడక్కడ కొంతమంది జనాలు సమూహాలుగా నీటికీ, తిండికి కష్టపడుతూ బ్రతుకుతారు. మరోవైపు హీరో ఓ టీనేజర్ తో కలిసి జంతువులను వేటాడి, బదులుగా ఏదో ఒక వస్తువుని తీసుకొని ఆ మాంసాన్ని అందరికీ పంచుతూ ఉంటాడు. అలాగే అదే ప్లేస్ లో మరో టీనేజర్ అమ్మాయి తన అమ్మమ్మతో కలిసి ఉంటుంది. ఈ టైంలోనే సడన్గా అక్కడికి కొంతమంది వచ్చి టీనేజర్లకు మంచి ఫుడ్, వాటర్ అందిస్తామని, చదువు చెప్తామని నమ్మించి అక్కడి నుంచి ఆ టీనేజర్ అమ్మాయిని, వాళ్ళ అమ్మమని తీసుకెళ్తారు. తీరా మధ్యలోకి వెళ్ళగానే హాస్పిటల్ కోసమని వాళ్ళ అమ్మమని పక్కకు తీసుకెళ్లి చంపేస్తారు.
అటువైపుగా వెళ్తున్న హీరో అతనితో పాటు ఉన్న టీనేజర్ ఇదంతా చూసి ఆ అమ్మమ్మని చంపిన వాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్లు అస్సలు చావరు. ఈ క్రమంలోనే సడన్గా ఓ ఆర్మీ అధికారిని ఊడిపడి, వాళ్ళ మెడల్ని తెగ్గోసి హీరోకి ఓ షాకింగ్ నిజాన్ని చెప్తుంది. దీంతో హీరో ఆ టీనేజర్ ఆర్మీ అధికారితోపాటు మరో గ్యాంగ్స్టర్ సహాయంతో హీరోయిన్ ని రక్షించాలి అనుకుంటారు. మరోవైపు అంతలోపే హీరోయిన్ తో పాటు అలాంటి కొంతమంది టీనేజర్స్ ని అపార్ట్మెంట్ అనే ప్లేస్ కి తీసుకెళ్తారు. అక్కడ సినిమా మొదట్లో కనిపించిన డాక్టర్ తన కూతుర్ని బ్రతికించుకోవడానికి టీనేజర్లపై ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. మరి ఆ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయా? హీరోయిన్ హీరో ఎలా కాపాడగలిగాడు? అనేది తెరపై చూడాల్సిందే.