Hyper Aadi : ‘జబర్దస్త్’ (Jabardasth) కామెడీ షోతో పాపులర్ అయిన సెలబ్రిటీలలో హైపర్ ఆది (Hyper Aadi) కూడా ఒకరు. ఈ షో వల్ల వచ్చిన పాపులారిటీతో ఆ తర్వాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలను చేయడంతో పాటు, సినిమా అవకాశాలు కూడా హైపర్ ఆదిని పలకరించాయి. తాజా ఇంటర్వ్యూలో హైపర్ ఆది ‘జబర్దస్త్’ను ఎందుకు వదిలి పెట్టాల్సి వచ్చిందో వెల్లడించారు.
‘జబర్దస్త్ ‘ ని వదిలేయడానికి కారణం ఇదేనా?
తాజా ఇంటర్వ్యూలో హైపర్ ఆది మాట్లాడుతూ తమకు నాగబాబు, రోజా ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈరోజు ఈ స్థాయికి ఎదిగామని వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జబర్దస్త్ వేదికపై తమ టాలెంట్ ను గుర్తించారని చెప్పుకొచ్చాడు. ఇక తను జబర్దస్త్ ను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో కూడా ఈ సందర్భంగా వివరించారు. “ఇప్పటికి జబర్దస్త్ మొదలుపెట్టి 11 నెలలు అవుతుంది. ఇన్నేళ్లు కంటిన్యూస్ గా సాగిన రన్నింగ్ షో ఇండియాలోనే లేదని చెప్పొచ్చు” అన్నారు హైపర్ ఆది.
“నువ్వు ఇప్పుడు సినిమా యాక్టర్ గా బిజీ అయిపోయావు. జబర్దస్త్ వాళ్ళకి కాల్షీట్లు ఇస్తున్నావా?” అనే ప్రశ్నకు హైపర్ ఆది స్పందిస్తూ “ప్రస్తుతం నేను జబర్దస్త్ చేయట్లేదు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తున్నాను. సినిమాలు చేస్తున్నాను కాబట్టి జబర్దస్త్ కి నేనే బ్రేక్ ఇచ్చాను. శ్రీదేవి, ఢీ ఏంటంటే స్పాంటేనియస్ ఫ్లోలో కొనసాగుతుంది. కానీ జబర్దస్త్ అంటే నేనే స్క్రిప్ట్ రాయాలి. మైండ్ వర్క్ చేయాలి. నేనే అందరిని ప్రాక్టీస్ చేయించాలి. అది ఒక స్కిట్ కి ఒక వారంలో నాలుగు రోజులు టైం తీసుకుంటుంది. ఎందుకంటే నేనే కూర్చుని రాసుకోవాలి, మళ్లీ నేనే అందరిని ప్రాక్టీస్ చేయించాలి. అది స్టేజ్ ఎక్కాక, పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు టెన్షన్ గా ఉంటుంది” అని వివరించారు హైపర్ ఆది.
వ్యూయర్షిప్ కు తగ్గట్టే పేమెంట్
ఈ సందర్భంగానే హైపర్ ఆది ‘జబర్దస్త్’లో పేమెంట్ ఎలా ఉంటుందో వెల్లడించారు. “వ్యూవ్ర్షిప్ ను బట్టి ఇక్కడ పేమెంట్ ఉంటుంది. దాన్నిబట్టి మేము కూడా డిమాండ్ చేయగలము. ఎక్కువ మంది చూడకపోతే అడగాలంటే మాకే సిగ్గుగా ఉంటుంది. అలా వచ్చిన వ్యూయర్షిప్ తోనే హైయెస్ట్ కూడా డిమాండ్ చేయగలిగాము. మేము జబర్దస్త్ లో టీం లీడర్ గా చేస్తున్న టైంలోనే బయట ఈవెంట్స్ కూడా ఎక్కువగా ఉండేవి” అని అన్నారు.
అంతేకాకుండా “ఈటీవీ, మల్లెమాలకు ఎప్పటికీ మేమందరం రుణపడి ఉంటాము. మల్లెమాల ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది. శ్యాం ప్రసాద్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎవడైనా వాళ్లకి రావాల్సిన పేమెంట్ ని వాళ్ళు మర్చిపోయినా… వీళ్ళు మాత్రం కరెక్ట్ టైం కి వేసేస్తారు. అందులో చేస్తున్న వారికి చిన్న కష్టం కూడా తెలియకుండా చూసుకుంటారు. అందులో పని చేస్తే గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక షో రన్నింగ్ లో ఉంటూనే ఉంటుంది. మన దగ్గర టాలెంట్ ఉండాలిగానీ, అక్కడ పని చేస్తే డోకా వుండదు” అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.