నిత్యం ఆఫీస్ వర్క్ తో స్ట్రెస్ ఫీలయ్యే మహిళలు అప్పుడప్పుడు సోలో ట్రిప్స్ కు వెళ్లడం వల్ల రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉమెన్స్ డే సందర్భంగా ఒక వేళ మీరు కూడా ప్లాన్ చేస్తే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రకృతి, అడ్వెంచరస్, ఆధ్యాత్మికత కలబోతతో కూడిన ప్రాంతాలుగా వెలుగొందుతున్నాయి. బీచ్‌లు, పర్వతాలు, చారిత్రక కోటలు, పుణ్యక్షేత్రాలు ఒకటేమిటీ కావాల్సి అన్న పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు సోలో ట్రిప్ ప్లాన్ చేసినట్లు అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాలను ట్రై చేయండి.
⦿ హైదరాబాద్
తెలంగాణ రాజధాని హైదరాబాద్.. సోలో ట్రావెలర్లకు అద్భుతమైన డెస్టినేషన్. చారిత్రక స్మారక చిహ్నాలు, షాపింగ్ వీధులు, రుచికరమైన ఫుడ్ సహా ఎంతో ఆహ్లాదకరంగా గడిపే అవకాశం ఉంటుంది.
చార్మినార్ & లాడ్ బజార్: హైదరాబాద్ ఐకానిక్ చిహ్నం చార్మినార్. ఎప్పుడూ సందడిగా ఉంటుంది. చార్మినార్ పక్కనే ఉన్న లాడ్ బజార్ మట్టిగాజులకు ఎంతో ఫేమస్.
గోల్కొండ కోట: నిజాం పరిపాలకు నిలువెత్తు నిదర్శనం గోల్కొండ కోట. ఈ కోట మీది నుంచి హైదరాబాద్ అందాలను అద్భుతంగా వీక్షించే అవకాశం ఉంటుంది.
సాలార్ జంగ్ మ్యూజియం: దేశంలోనే అతిపెద్ద మ్యూజియాలలో ఒకటి. ఎన్నో చారిత్ర కళాఖండాలకు నెలవుగా ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోలో ఒకటిగా గిన్నిస్ రికార్డును కలిగి ఉంది.
హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్: సాయంత్రం పూట ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది
⦿వరంగల్
వరంగల్ కు వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి సుమారు 3 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సోలోగా వెళ్లే వారికి ఇదో బెస్ట్ ప్లేస్. ఈ నగరం కాకతీయ రాజవంశ వారసత్వానికి ప్రసిద్ధి చెందినది. చరిత్ర ప్రియులకు స్వర్గధామంగా విరాజిల్లుతోంది. గత వైభవాన్ని గుర్తుకు తెచ్చే వరంగల్ కోట, అందంగా చెక్కబడిన పురాతన వేయి స్తంభాల ఆలయం, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే పాకాల సరస్సు, పురాతన భద్రకాళి ఆలయం ఎంతగానో ఆకట్టుకుంటాయి.
⦿విశాఖపట్నం
బీచ్ ను ఇష్టపడే మహిళలకు బెస్ట్ టూరిజం ప్లేస్. బీచ్‌లు, కొండలు ఆకట్టుకుంటాయి. ఏపీలో సురక్షితమైన, అందమైన నగరాల్లో వైజాగ్ ఒకటి. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, కైలాసగిరి హిల్ టాప్ పార్క్, సబ్ మెరైన మ్యూజియం ఎంతగానో ఆకట్టుకుంటాయి. వైజాగ్ నుంచి కొద్ది దూరంలో ఉన్న బొర్రా గుహలు, అరకు వ్యాలీ ఆహా అనిపిస్తాయి. కాఫీ తోటలు, గిరజన సంస్కృతి, జలపాతాలు, సాహస ప్రియులను ఆకట్టుకునే గండికోట అలరిస్తాయి. దేశంలోనే పొడవైన బెలం గుహలు, రంగనాథ స్వామి ఆలయం, కటికి జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి.
⦿ తిరుపతి
ఆధ్యాత్మిక అనుభవాన్ని కోరుకునే వాళ్లు తిరుపతికి వెళ్లడం బెస్ట్. ప్రశాంతమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే దేవాలయాలో ఒకటి శ్రీవేంకటేశ్వర ఆలయం. చూసి తరించే అవకాశం ఉంది. ఏపీలోనే ఎత్తైన తలకోన జలపాతాలను చూడవచ్చు. శ్రీవేంకటేశ్వర నేషనల్ పార్క్ లో ఎన్నో రకాల వన్యప్రాణాలను చూడవచ్చు.
సోలో లేడీ టూరిస్టులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సోలో ట్రిప్ కు వెళ్లే మహిళలు భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
⦿ మంచి రేటింగ్ ఉన్న హోటళ్లలోనే స్టే చేయాలి. హోటల్ రూమ్ బుకింగ్ కు ముందుకు రివ్యూలు చూడాలి.
⦿ ఉబర్, ఓలా లాంటి సురక్షితమైన రవాణా సదుపాయాలు ఎంచుకోండి.
⦿ అర్థరాత్రి పూట ఒంటరిగా తిరగకపోవడం మంచిది.
⦿ దేవాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సింఫుల్ గా ఉండే దుస్తులు ధరించండి.
⦿ మీ ఫోన్ లో ఎమర్జెన్సీ నెంబర్లు సేవ్ చేసుకోండి.
Read Also: సమ్మర్ లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి బెస్ట్ డెస్టినేష్స్ ఇవే!