World’s Most Expensive Airline Ticket: ప్రపంచంలో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలంటే విమానం ఎక్కాలి. అత్యంత వేగంగా, ఆహ్లాదకరంగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఇతర ప్రయాణాలతో పోల్చితే విమాన ప్రయాణం ఖరీదైనది. విమాన టికెట్ల ధరలు ఆయా రూట్లను బట్టి వేల నుంచి లక్షల్లో ఉంటాయి. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాన టికెట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఆ ఎయిర్ లైన్స్ కంపెనీ ఏంటి? దాని టికెట్ ధర ఎంత ఉంటుందో చూద్దాం..
ఒక విమాన టికెట్ ధర రూ. 55 లక్షలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టికెట్లను అమ్మేది ఎతిహాద్ ఎయిర్ లైన్స్ సంస్థ. ఈ సంస్థ ఒక్క టికెట్ ధర ఏకంగా 55,000 పౌండ్లుగా నిర్ణయించింది. భారత కరెన్సీలో ఈ ధర సుమారు రూ. 55 లక్షలుగా ఉంటుంది. ఈ టికెట్ టికెట్ రౌండ్ ట్రిప్ ప్రయాణం కోసం కాదు. కేవలం వన్ వే ప్రయాణం కోసం. ఈ టికెట్ కొనుగోలు చేసిన వారికి ‘రెసిడెన్స్ సూట్’ కేటాయిస్తారు. ఇందులో డబుల్ బెడ్, 27 ఇంచుల ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్ ఉంటుంది. ఇటాలియన్ డిజైనర్ తయారు చేసిన బెడ్ కవర్లు ఉంటాయి. ఈ టికెట్ బుక్ చేసుకున్న సంపన్న ప్రయాణీకులు ప్రైవేట్ చెక్ ఇన్ సేవలు, ప్రైవేట్ లాంజ్ లోకి ప్రవేశం లాంటి లగ్జరీ సదుపాయాలు పొందే అవకాశం ఉంటుంది.
ప్రయాణంలో రాచ మర్యాదలు
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఎయిర్ లైన్ టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణీకులకు మూడు గదుల సూట్ ను కేటాయిస్తారు. ఈ సూట్ ఎతిహాద్ కు చెందిన A380 విమానం ముందు ఎగువ డెక్‌లో ఉంది. 125 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గదిలో లివింగ్ రూమ్, బెడ్ రూమ్, ఎన్ సూట్ బాత్రూమ్ ఉంటాయి. లివింగ్ రూమ్ ఏరియాలో డబుల్ లెదర్ సోఫా, 32 అంగుళాల ఫ్లాట్ స్క్రీన్ టీవీ, రెండు ఫోల్డ్ అవే డైనింగ్ టేబుళ్లు ఉంటాయి. వీరి కోసం ఆహారాన్ని టాప్ ఆన్ బోర్డ్ చెఫ్ తయారు చేస్తారు. లండన్ లోని ఫైవ్ స్టార్ హోటల్ అయిన ది సావోయ్‌లో టాప్ శిక్షణ పొందిన బట్లర్ అందిస్తారు. ఇక సంపన్న కస్టమర్ కోరుకునే ఏదైనా బుక్ చేసుకోవడానికి ఒక ప్రైవేట్ ట్రావెల్ కన్సైర్జ్ ఉంటుంది. ముందు వరుస కాన్సర్ట్ (కచేరీ) టికెట్ల నుంచి టాప్ రెస్టారెంట్ లో రిజర్వేషన్ వరకు పొందవచ్చు. క్రీడా కార్యక్రమానికి టికెట్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
డబుల్ బెడ్‌ను కలిగి ఉన్న తొలి బిజినెస్ ఫ్లైట్
డబుల్ బెడ్‌ను కలిగి ఉన్న మొదటి వాణిజ్య విమానయాన సంస్థగా ఎతిహాద్ గుర్తింపు తెచ్చుకుంది. ఖరీదైన టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణీకులు.. ఈ సూట్ స్నానం చేసి, మేకప్ వేసుకుని, హెయిర్ డ్రైయర్ తో జుట్టును బ్లో డ్రై చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సకల సౌకర్యాలను పొందే అవకాశం ఉంటుంది.
Read Also: సమ్మర్ లో ఫారిన్ ట్రిప్స్? తక్కువ ఖర్చులో బెస్ట్ 7 కంట్రీస్ ఇవే!