BigTV English

Minister Sridhar Babu: యువతకు భారీ గుడ్ న్యూస్.. 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను చేయడమే మా లక్ష్యం: శ్రీధర్ బాబు

Minister Sridhar Babu: యువతకు భారీ గుడ్ న్యూస్.. 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను చేయడమే మా లక్ష్యం: శ్రీధర్ బాబు

Minister Sridhar Babu: తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్ల(AI Engineer)ను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులతో సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబున భేటీ అయ్యారు.


ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కు హబ్ గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న విధానాలపై వారతో మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ, అక్కడే ఏర్పాటు చేయబోతున్న ఏఐ యూనివర్సిటీ గురించి మంత్రి వారికి వివరించారు. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్ గా హైదరాబాద్ మారుతుందని చెప్పారు. ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ALSO READ: Inter Results: ఇంటర్ ఫలితాలు ఎప్పుడు..? ఫలితాలు ఎలా చూసుకోవాలి..? ఇదిగో పూర్తి వివరాలు..


తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న విధానాలపై మంత్రి శ్రీధర్ బాబు వారికి వివరించారు. పరిశ్రమల ఏర్పాటును ఒక్క హైదరాబాద్ కే పరిమితం చేయకుండా.. వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలపై స్థానిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని ప్రతినిధుల బృందాన్ని మంత్రి కోరారు. టెక్నాలజీ, స్కిల్ డెవలెప్ మెంట్, ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సమావేశంలో కాన్సూల్ వైష్ణవి వాసుదేవన్, ఫస్ట్ సెక్రటరీ(ఎకానమిక్) వివేక్ రఘు రామన్, ఎంటర్ ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్(ఇండియా – సౌత్) డేనిస్ టాం తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Sumaya reddy: సోషల్ మీడియా రచ్చ.. ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ తో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ALSO READ: Atthammaa’s Kitchen Prices: అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం.. మెగా ఫ్యామిలీకి చుట్టుకుందా.. అసలేమైందంటే..?

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×