Indian Railway Journey: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు ఈజీగా జర్నీ చేసే అవకాశం కల్పించేందుకు రకరకాల రూల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఆన్ లైన్ ద్వారా, ఆఫ్ లైన్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నది. రైలు ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా కన్ఫార్మ్ టికెట్ పొందే వెసులుబాటును అందిస్తున్నది. అయితే, కొన్నిసార్లు మీరు అర్జంట్ గా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ, టికెట్స్ అందుబాటులో ఉండవు. అలాంటి సమయంలో సింఫుల్ గా ఓ పని చేస్తే, రిజర్వేషన్ బోగీలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
జనరల్ టికెట్ తో రిజర్వేషన్ బోగీలో ప్రయాణం
అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి ఉండి, టికెట్స్ అందుబాటులో లేని సమయంలో జనరల్ టికెట్ తీసుకోని, రిజర్వేషన్ కోచ్ లో జర్నీ చేసే వీలుంటుంది. అలాంటి సమయంలో సింఫుల్ గా ఓ పని చేయాలి. ముందుగా మీరు IRCTC యాప్ ఓపెన్ చేయాలి. ఛార్ట్ వెయికెన్సీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రైన్ నెంబర్, బోర్డింగ్ స్టేషన్, జర్నీ డేట్ ఎంటర్ చేసి, గెట్ డీటైల్స్ మీద ట్యాప్ చేయాలి. ఆ సమయంలో రైల్లో అందుబాటులో ఉన్న సీట్ నెంబర్లు అన్నీ డిస్ ప్లే అవుతాయి. వెంటనే స్టేషన్ లోని టికెట్ సెంటర్ కు వెళ్లి, ఖాళీగా ఉన్న సీట్లలో మీకు నచ్చింది బుక్ చేయగలరేమో అక్కడి సిబ్బందిని అడగాలి. రిజర్వేషన్ చేయడం కుదురుతుందని చెప్తే హ్యాపీగా కన్ఫార్మ్ టికెట్ తీసుకోవచ్చు. ఒకవేళ చేయడం కుదరదని చెప్తే, జనరల్ టికెట్ తీసుకోండి. రైలు ఎక్కి ఖాళీగా ఉన్న సీటు దగ్గరికి వెళ్లి కూర్చోండి. టీసీ వచ్చాక రిక్వెస్ట్ చేసి, ఆ సీటు అమౌంట్ పే చేయండి. హ్యాపీగా జర్నీ చేయండి.
Read Also: దేశంలో పట్టాలెక్కిన తొలి రైలు ఇదే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందంటే?
స్లీపర్ టికెట్ తో థర్డ్ ఏసీలో ప్రయాణం చేసే అవకాశం
ఇక రైలు టికెట్లు బుక్ చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన మరో ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు టికెట్ బుక్ చేసిన ప్రతి సారి కన్సిడర్ ఫర్ ఆటో అప్ గ్రెడేషన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే.. ఉదాహారణకు మీరు స్లీపర్ లో టికెట్ బుక్ చేసున్నారు అనుకోండి. రైలు ప్రయాణానికి కొద్ది గంటల ముందు ఛార్ట్ ప్రిపేర్ అవుతుంది. ఆ సమయంలో థర్డ్ ఏసీలో ఏమైనా సీట్లు ఖాళీగా ఉంటే.. మిమ్మల్ని అక్కడికి పంపిస్తారు. అయితే, ఇందుకోసం ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. సో, ఇకపై రైలు టికెట్ బుక్ చేసే సమయంలో కచ్చితంగా ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. స్లీపర్ టికెట్ తో ఏసీలో ఎంజాయ్ చేస్తూ వెళ్లండి. ఈ విషయాలు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. వారు కూడా రైలు జర్నీ ఎంజాయ్ చేసేలా చూడండి!
Read Also: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రైల్వే మార్గాలు.. ఏమాత్రం తేడా వచ్చినా గోవిందా!