BigTV English

Surya Kumar Yadav: మిస్టర్ 360 టీమిండియాలో ఉండి దండగ.. సూర్యపై దారుణంగా ట్రోలింగ్స్

Surya Kumar Yadav: మిస్టర్ 360 టీమిండియాలో ఉండి దండగ.. సూర్యపై దారుణంగా ట్రోలింగ్స్

Surya Kumar Yadav: 2024లో భారత జట్టు టి-20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టి-20 క్రికెట్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం భారత స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ {Surya Kumar Yadav} టీమిండియా టి-20 క్రికెట్ కి 2024 జులైలో కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుండి సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా 19 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 16 విజయాలను సాధించడం గమనార్హం.


Also Read: Ambati Rayudu: BJPలోకి టీమిండియా మాజీ క్రికెటర్.. జనసేనను కాదని!

కానీ సూర్య కుమార్ యాదవ్ {Surya Kumar Yadav} మాత్రం పేలవ ఫామ్ తో బాధపడుతున్నాడు. గత 12 మ్యాచ్ లలో సూర్యకుమార్ యాదవ్ 24.50 సగటుతో కేవలం 242 పరుగులు మాత్రమే చేశాడు. గత కొన్నేళ్లుగా టీ-20 క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సూర్య.. ప్రస్తుతం పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. అతడి స్థాయితో పోల్చి చూస్తే ఈ 242 పరుగులు ఓ లెక్క కాదు. ఎందుకంటే అతడి {Surya Kumar Yadav} బ్యాటింగ్ స్టామినా అద్భుతంగా ఉంటుంది. కానీ సూర్య మాత్రం తన స్థాయికి తగ్గట్టుగా ఆడడం లేదు.


ఈమధ్య 360 డిగ్రీ యాక్షన్ తో కనిపించడం లేదు సూర్య. 2022లో 1,164 పరుగులు చేసిన సూర్య.. 2023లో మాత్రం 17 ఇన్నింగ్స్ లలో కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టి-20 సిరీస్ లో కూడా {Surya Kumar Yadav} ఘోరంగా నిరాశపరుచుతున్నాడు. కలకత్తా వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో (0)పరుగులకే వెనుదిరిగాడు సూర్య. అనంతరం చెన్నై లోని చెపక్ స్టేడియం వేదికగా జరిగిన రెండవ టి-20 లో కూడా కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు.

దీంతో సూర్య కుమార్ {Surya Kumar Yadav} ఆట తీరుని అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అతడి ఫామ్ దిగజారడానికి ప్రధాన కారణం అదనపు బాధ్యత అని ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. జట్టుకు నాయకత్వం వహించే ఒత్తిడి సూర్య కుమార్ యాదవ్ పై పెరిగిపోయిందని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే సూర్య పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడని విశ్లేషిస్తున్నారు.

Also Read: Ind vs Eng, 3rd T20I: నేడు రాజ్‌కోట్‌ లో మ్యాచ్.. షమీ వచ్చేస్తున్నాడు ?

ఇంగ్లాండ్ తో జరగబోయే మిగతా మూడు టి-20 మ్యాచ్ లలో అయినా {Surya Kumar Yadav} మళ్లీ పాత రిథమ్ లోకి వచ్చి 360 డిగ్రీ బ్యాటింగ్ చూపిస్తాడో..? లేదో..? వేచి చూడాలి. ఒకవేళ అతడు ఇదే ఆట తీరుని పునరావృతం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు. అతడు తన బ్యాట్ తో తిరిగి మళ్లీ ఫామ్ లోకి రాలేకపోతే రోహిత్ శర్మ లాగా రిటైర్మెంట్ కూడా ప్రకటించాలనే డిమాండ్స్ వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు 80 టీ-20 మ్యాచ్ లు ఆడిన సూర్య కుమార్ యాదవ్.. 76 ఇన్నింగ్స్ లలో 39.72 సగటుతో 2,582 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×