BigTV English

Sreemukhi: శ్రీముఖిని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయట.. మరీ అంత కరువా అవినాష్.?

Sreemukhi: శ్రీముఖిని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయట.. మరీ అంత కరువా అవినాష్.?

Sreemukhi: శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో ఈవారం ఎపిసోడ్ అంతా పుష్ప థీమ్‌తోనే సాగబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇందులో పుష్ఫ 1లో అల్లు అర్జున్, రష్మికగా అల్లు అర్జున్, దీపికా రంగరాజ్ నటించారు. పుష్ప 2లో అల్లు అర్జున్, రష్మికగా అర్జున్, సుహాసిని నటించారు. ఇక ఫాహద్ ఫాజిల్ పాత్రలో సద్దామ్ హుస్సేన్ కనిపించాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలో కనిపించి పుష్ప సినిమాను మరోసారి ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. మధ్యమధ్యలో డబుల్ మీనింగ్ జోకులు కూడా యాడ్ అయ్యాయి. దాంతో పాటు ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉందని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.


శ్రీముఖిపైనే కౌంటర్

‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’లో శ్రీముఖికి పాలేర్లుగా హరి, అవినాష్ ఉండడం కామనే. ఇక హరి కూడా పుష్పను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. ‘‘ఇది హరిగాడి రూల్’’ అని అనగానే ‘‘మొన్నటి వరకు పరివారంలో ఒక రోల్ అడుక్కు తినేవాడు’’ అంటూ కౌంటర్ ఇచ్చింది శ్రీముఖి. అదేమీ పట్టించుకోకుండా ‘‘నిన్ను చూస్తుంటే ఫీలింగ్స్ వస్తుండాయ్. నేను వచ్చి ఇచ్చేదా ముద్దు’’ అని అన్నాడు అవినాష్. అది విన్న శ్రీముఖి.. హరినే బెటర్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ముందుగా పుష్ప 1లో అల్లు అర్జున్‌గా అమర్‌దీప్ ఎంట్రీ ఇచ్చి కూలోడిలాగా రావడం కోసం కష్టపడ్డాను అనగానే నార్మల్‌గా వచ్చినా కూలోడిలాగానే ఉంటావని హరి కౌంటర్ ఇచ్చాడు.


అందరినీ కవర్ చేశారు

పుష్ఫలో కేశవ పాత్రలో నూకరాజు కనిపించాడు. సునీల్ పాత్రలో ఇమాన్యుయెల్, అనసూయ పాత్రలో రోహిణి ఎంట్రీ ఇచ్చారు. అక్కడికి, ఇక్కడికి చాలా మారిపోయావంటూ ఇమాన్యుయెల్‌తో అంటాడు నూకరాజు. ‘‘సరుకు అక్కడ అందితే ఒక రేటు, ఇక్కడ అందితే ఒక రేటు’’ అంటూ రెండు ఛానెల్స్‌లో, రెండు షోలను బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా ఇన్‌డైరెక్ట్‌గా చెప్తాడు ఇమాన్యూయెల్. ‘‘నీ మీద ఎక్కి కూర్చొని గొంతు కోసి చంపేస్తా’’ అని రోహిణి అనగానే.. ‘‘నువ్వు గొంతు కోసే వరకు ఎక్కడుంటా.? నువ్వు మీద ఎక్కగానే చావను..’’ అని చెప్పి నవ్విస్తాడు. సద్దామ్ వచ్చి పార్టీ కావాలి అనగానే ‘‘ఖాళీగా ఉన్న నీకు పిలిచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నువ్వే పార్టీ ఇవ్వాలి’’ అని అన్నాడు హరి.

Also Read: మళ్లీ అలా జరగదు.. వీడియో వదిలిన యాంకర్ రవి, సారీ చెప్పకుండానే..

ఐటెమ్ సాంగ్స్ కూడా

‘ఊ అంటావా’ పాటకు రీతూ వర్మ, ‘కిసిక్’ పాటకు ప్రియాంక జైన్ స్టెప్పులేసినట్టుగా కూడా ఈ ప్రోమోలో చూపించారు. మాటిమాటికి సద్దామ్ వచ్చి ఒకటి తగ్గింది అనడంతో దీపికా వచ్చి తనకు జుట్టు తగ్గిందంటూ విగ్ పెట్టి వెళ్లిపోతుంది. ఇక ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి పుష్ప ఫేమ్ కేశవ కూడా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందరూ కలిసి కాసేపు పుష్ఫలోని సీన్స్‌ను రీక్రియేట్ చేశారు. అంతే కాకుండా వారిని ఎంటర్‌టైన్ చేయడం కోసం ఇద్దరు ఫారిన్ బ్యూటీలను కూడా తీసుకొచ్చారు. వారు ఎంటర్ అవ్వగానే కమెడియన్స్ అంతా తమ ఇంగ్లీష్‌తో వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారు. మొత్తానికి ఎపిసోడ్‌లోని ఎంటర్‌టైన్మెంట్ అంతా ప్రోమోలోనే కనిపించేలా చేశారు మేకర్స్.

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×