BigTV English

OTT Movie : మొగుడు చచ్చాడని అతని ఫ్రెండ్ తో … పదేళ్ళ తరువాత ఊహించని ట్విస్ట్ … ప్రియమణి క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : మొగుడు చచ్చాడని అతని ఫ్రెండ్ తో … పదేళ్ళ తరువాత ఊహించని ట్విస్ట్ … ప్రియమణి క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలలో ఎక్కువగా ఇటువంటి సినిమాలు వస్తున్నాయి. వీటిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించింది. ఈమె భర్త చనిపోయాడనుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అతను తిరిగి రావడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


జీ 5 (ZEE5) లో

ఈ బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అతీత్’ (Ateet). 2020 లో విడుదలైన ఈ సినిమాకు తనుజ్ బ్రమర్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియమణి,సంజయ్ సూరి, రాజీవ్ ఖండేల్వాల్, దేశ్నా దుగద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ ఒక సైనికుడి చుట్టూ తిరుగుతుంది. అతను యుద్ధంలో మరణించినట్లు సమాచారం వస్తుంది. అయితే అతను దాదాపు ఒక దశాబ్దం తర్వాత తన ఇంటికి తిరిగి వస్తాడు.ఈ స్టోరీ లో ఊహించని మలుపులు కూడా ఉంటాయి. ఇది జీ 5 (ZEE5) ఓటీటీ లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

కెప్టెన్ అతీత్ రానా ఒక యుద్ధంలో కనిపించకుండా పోతాడు. అక్కడ ఉన్న అధికారులు అతడు చనిపోయినట్లు భావిస్తారు. ఆ తరువాత అతని సీనియర్ అధికారి విశ్వ కర్మ, అతీత్ భార్య జాన్వీ, కూతురు సనా ని సంరక్షించే బాధ్యత తీసుకుంటాడు. కొన్ని రోజులకు విశ్వ కర్మ జాన్వీని వివాహం చేసుకుంటాడు. వీళ్ళంతా కలిసి ఒక కుటుంబంలా జీవిస్తారు. సనాకి తన తండ్రి అతీత్ గురించి ఎటువంటి వివరాలు తెలియవు.ఊహ కూడా తెలియని వయసులోనే సైనికుడిగా వెళ్ళిపోతాడు అతీత్ రానా. ఆమె ఇప్పుడు విశ్వ కర్మనే తన తండ్రిగా భావిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ బయట పడుతుంది. దశాబ్దం తర్వాత, అతీత్ రానా అనూహ్యంగా తిరిగి వస్తాడు. అతను తన కుటుంబాన్ని తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవ నుకుంటాడు. తన భార్యని విశ్వ కర్మ పెళ్లి చేసుకోవడంతో రగిలిపోతాడు. విశ్వ కర్మ గతంలో చేసిన ఒక చీకటి రహస్యాన్ని బయటపెట్టాలని అనుకుంటాడు అతీత్ రానా.

అతీత్ తిరిగి రావడంతో, అతను జీవించి ఉన్నాడా లేక మరణించాడా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అతీత్, విశ్వ కర్మ మధ్య ఉన్న గత సంబంధం అప్పుడే తెలుస్తుంది. విశ్వ కర్మ అసూయ మనస్తత్వం వల్లే అతీత్ ఇలా అవ్వడానికి కారణం. జాన్వీ తన గతం, భవిష్యత్తు మధ్య చిక్కుకుని, తన కూతురు సనాని కాపాడుకోవడానికి పోరాడుతుంది. చివరికి అతీత్ ఎలా బతికి ఉన్నాడు? ఈ పదేళ్లలో అతను ఎక్కడ ఉన్నాడు ? ఎందుకు ఇప్పుడు తిరిగి వచ్చాడు ? ఇప్పుడు జాన్వీ పరిస్తితి ఏమిటి ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాలో థ్రిల్లర్, సూపర్‌నాచురల్ అంశాలు కలిసి ఉంటాయి. అయితే ఈ స్టోరీ చివరికి కొన్ని అనూహ్య మలుపులతో ముగుస్తుంది

Also Read : అక్క ఒకడితో, చెల్లెలు మరొకడితో… ఊరంతా కలసి ఇద్ధరినీ వదలకుండా … ఈ రచ్చ ఏంది భయ్యా

Tags

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×