Fire Accident: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ యాక్సిడెంట్ జరగగానే భారీగా మంటలు ఎగిసిపడడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. మంటల్లో పలువురు అపార్ట్‌మెంట్ వాసులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కాలనీ వాసులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేశారు. ఇప్పటికే 25 మందిని ఫైర్ సిబ్బంది కాపాడినట్లు సమాచారం.
అయితే అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల చాలా మంది పొగలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కూడా రక్షించి హాస్పిటల్‌కు తరలించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఫైర్ అలారం వెంటనే మోగడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగులు పెట్టారు.
ALSO READ: LKG చదువుతున్న చిన్నారిపై.. దారుణం..!
ఈక్రమంలోనే మహిళలు వారి బిడ్డలను రక్షించేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పై అంతస్తులో మంటల వల్ల పొగ నిండిపోవడంతో ప్రాణాలను కాపాడుకోవడానికి బాల్కనీ నుంచి పిల్లలను కింద ఫ్లోర్‌లో ఉన్న వారికి అందించారు. అందుకే భారీ ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు తెలిపారు. స్వల్పంగా గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.