BigTV English

OTT Movie : హెచ్ఐవి ఉన్న అమ్మాయిపై అఘాయిత్యం… క్లైమాక్స్ ట్విస్ట్ డోంట్ మిస్

OTT Movie : హెచ్ఐవి ఉన్న అమ్మాయిపై అఘాయిత్యం…  క్లైమాక్స్ ట్విస్ట్ డోంట్ మిస్

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా మెప్పించ లేకపోయినా ఓటిటిలో సందడి చేస్తూ ఉంటాయి. చేయని తప్పుకు అకారణంగా శిక్ష అనుభవించిన ఒక అమ్మాయి కథతో తెరకెక్కించారు మేకర్స్. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు అరువి (Aruvi). ఒక అమ్మాయికి తప్పు చేయకుండానే హెచ్ఐవి సోకడంతో, ఆ అమ్మాయి పడే నరకయాతన చూస్తే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

అరువిని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని పోలీసు అరెస్టు చేస్తారు. ఆమె నుంచి నిజాలు తెలుసుకోవాలని విచారణ  చేస్తారు. ఈ క్రమంలో తండ్రిని కూడా పిలిపించి పోలీసులు ఎంక్వయిరీ చేస్తారు. ఆమెను పోలీసులు కొట్టడంతో స్పృహ కోల్పోగా, ఆమెను పోలీసులు హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఈ క్రమంలోననే  స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. అరువి ఒక సాధారణ అమ్మాయి. ఆమె తండ్రి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒక పల్లెటూరులో నివసిస్తూ ఉంటాడు. ఉద్యోగం సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో సిటీకి వస్తారు. అక్కడ జెస్సి అనే అమ్మాయి అరువుకి పరిచయం అవుతుంది. జెస్సి కొంచెం ఫాస్ట్, సిటీ కల్చర్ కి అలవాటు పడి ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరోజు కొబ్బరి బొండం తాగుతుండగా కొబ్బరి బొండం కొట్టే వ్యక్తి నుంచి రక్తం కారుతూ కొబ్బరిబోండంలోకి వెళ్తుంది. అతనికి హెచ్ఐవి ఉండటంతో అరువుకి కూడా హెచ్ఐవి పాజిటివ్ వస్తుంది. ఈ విషయం తెలిసి తన కూతురు తప్పు చేసిందని తల్లిదండ్రులు బాగా మందలించడంతో, ఆమె ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. ప్రాణంగా ప్రేమించే తండ్రి కూడా మానేసిన సిగరెట్లను మళ్లీ తాగడం అలవాటు చేసుకుంటాడు. అలా బయటికి వచ్చిన అరువీ ఒక హిజ్రా తో కలిసి పని చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని తన దగ్గర ఉన్న డబ్బును తీసుకొని హాస్పిటల్ కి వెళుతుంది. అక్కడ కుటుంబ సభ్యులు ఆమెను దగ్గరికి రానీయకపోవడంతో ఏడుస్తూ తిరిగి వెళ్లిపోతుంది. ఇలా ఉంటే ఒక రోజు ముగ్గురు వ్యక్తులు అరువిని అఘాయిత్యం చేస్తారు.

ఈ విషయం మీడియాలో చర్చకు పెడతారు. అయితే యాంకర్ చర్చ జరుపుతుండగా ఆరువితో వీళ్ళ నుంచి మీకు ఏం కావాలి అని అడుగుతుంది. సారీ చెప్తే సరిపోతుంది అని ఆరువి చెప్తుంది. ఇంత చేసిన వీళ్ళు సారీ ఒకటే చెప్తే సరిపోతుందా అని ఎదురు ప్రశ్న వేస్తుంది. అప్పుడు తనకు హెచ్ఐవి ఉందని వీళ్లకు కూడా సోకే ప్రమాదం ఉందని అరువి చెప్తుంది. అక్కడ డాక్టర్లతో వాళ్లకు హెచ్ఐవి టెస్ట్ చేయిస్తారు. అయితే రిపోర్ట్ లో వాళ్లకు హెచ్ఐవి సోకి ఉండదు. ఛానల్ రేటింగ్ పెరుగుతుందని, ఈ విషయాన్ని సాగదీయాలని మీడియా ప్రతినిధి ఆలోచిస్తాడు. ఈ విషయం గ్రహించిన అరువి మా ప్రాణాలంటే మీకు లెక్క లేదా అంటూ రివాల్వర్ తో మీడియా యజమాని చేతి పై కాలుస్తుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో స్టొరీ నడుస్తుంది. చివరికి అరవిని పోలీసులు ఉగ్రవాదులతో లింకు ఉందని ఎందుకు అరెస్టు చేశారు? ఆమె ఈ కేసు నుంచి బయటికి వస్తుందా? హెచ్ఐవి సోకిన ఈ అమ్మాయిని కుటుంబ సభ్యులు ఆహ్వానిస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : గ్రామీణ నేపథ్యంలో మరో వెబ్ సిరీస్… పల్లెటూరి ప్రేమలు… బంగారు గాజులదే కీలక పాత్ర

OTT Movie : నాలుగు స్టోరీలతో కేక పెట్టిస్తున్న సినిమా … ఒక్కొక్కటి ఒక్కోరకం … ఉహకందని ట్విస్టులు

OTT Movie : మేడమ్ సార్ మేడమ్ అంతే… పెళ్లి వద్దంట, అది మాత్రమే ముద్దు… ఒకరి తరువాత ఒకరు

OTT Movie : స్టార్ నటుడి వెర్రి వేషాలు… నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా… తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … IMDbలో 9.1 రేటింగ్

OTT Movie : 7 నుంచి 17 ఏళ్ళున్న అమ్మాయిలే టార్గెట్… ఊహించని మలుపులు… థ్రిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×