E-Paper
Advertisement

రెండో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి శిరీష.. వరుడు ఎవరంటే?

రెండో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి శిరీష.. వరుడు ఎవరంటే?
Advertisement

Actress Sireesha:ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమకు నచ్చిన వారిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం తర్వాత నచ్చకపోతే వేరు పడడం అన్నీ సాధారణంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు బుల్లితెర సెలబ్రిటీలు తామేమి ఇందుకు అతీతం కాదు అంటున్నారు. నచ్చినవారిని పెళ్లి చేసుకుంటున్నారు. పిల్లలు పుట్టాక నచ్చకపోతే విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఆ తర్వాత కొత్త తోడు కోసం ఇంకొకరిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో ఇప్పుడు బుల్లితెర నటి శిరీష (Sireesha).కూడా ఒకరు. ఇదివరకే పెళ్లి అయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు.. అయితే ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. గత రెండు మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్న శిరీష ఎట్టకేలకు రెండో పెళ్లి చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేసింది.

రెండో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి శిరీష..

ప్రముఖ నటుడు , ఆర్ జే, యాంకర్ అయిన మహేంద్ర బొర్రాతో ఏడడుగులు వేసింది. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. “ఎట్టకేలకు రహస్యం బయటపడింది. శాశ్వత బంధం మొదలైంది. జీవితాంతం ఈ బంధం సంతోషంగా కొనసాగాలని, మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సిరి వెడ్స్ మహి ” అంటూ లవ్ ఎమోజిని షేర్ చేస్తూ…తమకు పెళ్లయింది అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది శిరీష. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కంగ్రాట్యులేషన్స్ అని , సూపర్ జోడి అని, దేవుడు ఎప్పుడు మీకు అండగా నిలుస్తారని ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికైతే రెండో పెళ్లి చేసుకున్న శిరీష ఈ వైవాహిక బంధం లోనైనా సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

also read:బిగ్ బాస్ ప్రియులకు సర్ప్రైజ్.. హౌస్ లోకి వెళ్ళే జబర్దస్త్ కమెడియన్స్ వీళ్ళే!

శిరీష భర్త బ్యాక్ గ్రౌండ్..

శిరీష వివాహం చేసుకున్న మహేంద్ర విషయానికి వస్తే.. ఈయన బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. యాంకరింగ్ కే పరిమితం కాకుండా నటుడిగా ఇంటింటి రామాయణం, మగువ ఓ మగువ వంటి సీరియల్స్ లో కూడా కీలక పాత్రను పోషించారు.. ఇప్పుడు ఎట్టకేలకు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

శిరీష మహేంద్ర పరిచయం..

Advertisement

శిరీష – మహేంద్ర మధ్య పరిచయం ఒక ఈవెంట్లో మొదలైంది. ఆ తర్వాత కాలంలో స్నేహంగా మారినట్లు సమాచారం.. ఇకపోతే వీరిద్దరి మధ్య అనుబంధం బలపడి, అది ప్రేమగా మారడంతోనే పెద్దల అంగీకారంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు . అయితే ఈ వేడుకను ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా చేసుకున్నట్లు శిరీష షేర్ చేసిన ఫోటోలు చూస్తే తెలుస్తోంది.

శిరీష కెరియర్:

మొగలిరేకులు సీరియల్ తో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన శిరీష.. రాములమ్మ, చెల్లెలి కాపురం, స్వాతి చినుకులు ఇలా మంచి ప్రజాధారణ పొందిన సీరియల్స్ లో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ప్రస్తుతం బొమ్మరిల్లు అనే సీరియల్ లో విలన్ పాత్ర పోషిస్తున్న ఈమె.. అటు వేరే సీరియల్స్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే గతంలో కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు నవీన్ అనే వ్యక్తి వివాహం చేసుకుంది. ఇద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించారు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు, వ్యక్తిగత విభేదాలు రావడంతో విడిపోయారు.

Related News

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Big Stories

Advertisement
×