E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 విన్నర్ పై అమర్ దీప్ కామెంట్స్.. గెలిచేది ఎవరంటే?

బిగ్ బాస్ 10 విన్నర్ పై అమర్ దీప్ కామెంట్స్.. గెలిచేది ఎవరంటే?
Advertisement

Amardeep Chowdary: అమర్ దీప్ చౌదరి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన అమర్ జానకి కలగనలేదు(Janaki Kalaganaledu) అనే సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సీరియల్ మంచి గుర్తింపు తీసుకురావడంతో తదుపరి అమర్ దీప్ (Amardeep)బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో రన్నర్ గా అమర్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అదే విధంగా సినిమాలలో కూడా హీరోగా అవకాశాలను అందుకున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ 10 పై అమర్ కామెంట్స్..

ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న అమర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అమర్ తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కార్యక్రమం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రస్తుతం బిగ్ బాస్10(Bigg Boss 10) తెలుగు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మీకు బాగా క్లోజ్ ఎవరు? ఎవరు విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు అమర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

విన్నర్ ఎవరో ఇప్పుడే చెప్పలేము..

Advertisement

బిగ్ బాస్ కార్యక్రమంలో నాకు ముఖేష్ చాలా బాగా క్లోజ్ అని అమర్ తెలిపారు. దెబ్జానీ, టెంపర్ వంశీ, రాంప్రసాద్ అన్న వీరంతా చాలా బాగా క్లోజ్ అని అమర్ తెలియజేశారు. అయితే ఈ షో ప్రారంభం అయ్యి ఇంకా మూడు వారాలు అవుతుంది అప్పుడే విన్నర్ ఎవరో చెప్పడం చాలా కష్టం అని తెలిపారు. ఇంకా కొద్ది రోజులు గడిస్తేనే విన్నర్ ఎవరో చెప్పగలం అంటూ అమర్ తెలిపారు. ఇక అగ్నిపరీక్ష కార్యక్రమం గురించి కూడా ఈ సందర్భంగా అమర్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. అగ్ని పరీక్ష అనేది కూడా ఒక షో మనల్ని అక్కడ గెస్ట్ గా పిలుస్తారు. మనం వెళ్ళి పని మనం చేసుకుని రావాల్సిందే అంటూ ఈయన చెప్పిన సమాధానం వైరల్ అవుతుంది.

కప్పు ఎవరికి సొంతం?

ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కామన్ మాన్ క్యాటగిరిలో భాగంగా కంటెస్టెంట్ లో హౌస్ లోకి అడుగు పెడుతున్నారు. ఇక ఇప్పుడు హౌస్ లోకి వెళ్లిన కామనర్స్ లో అపూర్వ చాలా అద్భుతంగా అగ్నిపరీక్ష షోలో ఫర్ఫార్మెన్స్ చేసిందని అమర్ తెలియజేశారు. గతంలో కూడా అమర్ కామన్ మ్యాన్ తో పోటీ పడటం, కామన్ మ్యాన్ క్యాటగిరి లో వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం, అమర్ రన్నర్ అవ్వడం జరిగింది. మరి ఈసారి కప్పు కామనర్ సొంతం అవుతుందా? లేదా సెలబ్రిటీ సొంతం అవుతుందా? అనేది తెలియాల్సిందే.

Advertisement

Also Read: ఈ సంక్రాంతి మనదే.. కాకా పై చిరు అప్డేట్!

Related News

ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన అమర్‌దీప్ చౌదరి!

బిగ్ బాస్ వల్ల ఒరిగిందేం లేదు…అమర్ దీప్ కామెంట్స్ వైరల్!

జబర్దస్త్ షో నుంచి రోజాను తప్పించారా? నిజం ఆమె మాటల్లోనే!

ఝాన్సీ ‘రైతుబిడ్డ’ ట్యాగ్ పై ఈటీవీ ప్రభాకర్ రియాక్షన్!

బిగ్ బాస్ 10 కొత్త కెప్టెన్ గా ముఖేష్.. ఆమెకు స్పెషల్ బెనిఫిట్స్?

Illu Illaalu Pillalu Ramaraju : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రామరాజు గుడ్ బై..

సీరియల్ నటి ఐశ్వర్య  ప్రేమలో పడిందా..? ఇదేం ట్విస్ట్ మావా..

Big Stories

Advertisement
×