Chiranjeevi On Kaaka: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ (Bobby)దర్శకత్వంలో కాకా (Kaaka)సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. త్వరలోనే సినిమా షూటింగ్ పనులు పూర్తి కాబోతున్నాయి. ఇలా ఒకవైపు షూటింగ్ పనులను శరవేగంగా కొనసాగిస్తూనే మరోవైపు డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు వేగవంతం అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు. తాజాగా చిరంజీవి సందీప్ కిషన్ హీరోగా సంజయ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సిగ్మా (Sigma)సినిమా వేడుకకు హాజరయ్యారు.
ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతమ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాకా సినిమా గురించి కూడా మాట్లాడారు. కాకా సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం ఆర్ ఆర్ మొదలు పెట్టారని చిరంజీవి తెలిపారు అదే విధంగా కాకా గురించి కూడా మాట్లాడుతూ మొదటి భాగం పూర్తి అయిందని రెండో భాగం కూడా దాదాపు 30% షూటింగ్ పూర్తి అయ్యిందనీ చిరంజీవి తెలిపారు.
ఈ సినిమాకు సంబంధించి ఇకపై ఎలాంటి లీక్స్ ఇవ్వను అని చెబుతూనే సినిమా దాదాపు 70% షూటింగ్ పూర్తి అయ్యిందని చిరంజీవి తెలియచేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని ఈసారి సంక్రాంతి మనదే అంటూ ఈ సినిమా సక్సెస్ అవుతుందని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా జనవరి 13 ,2027వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి కదిరి కాళిదాసు అనే పాత్రలో కనిపించబోతున్నారని స్వయంగా చిరంజీవి లీక్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా వేడుకలో కూడా 20 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, సినిమా అద్భుతంగా వచ్చిందంటూ చిరంజీవి మాట్లాడటంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈసారి సంక్రాంతికి బాస్ ఎలాంటి హిట్ కొట్టబోతున్నారు తెలియాల్సి ఉంది.
Also Read: నాని పై ఇండస్ట్రీలో కుట్ర జరుగుతుందా? సక్సెస్ ను జీర్ణించుకోలేకపోతున్నారా?