Hari Hara Veera Mallu film: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడున్న సీజన్‌లో ఎవరు, ఎప్పుడు ఏ పార్టీ వైపు ఉంటారో తెలియని రోజులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆసక్తికర పోస్టు చేశారు. దీని వెనుక వైసీపీ స్కెచ్ ఏమైనా ఉందా? అప్పుడే చిన్నపాటి చర్చ మొదలైంది.
పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా దేశవ్యాప్తంగా గురువారం విడుదల కానుంది. ఈ మూవీపై ఇండస్ట్రీలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీర మల్లు సూపర్ డూపర్ హిట్టై కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు.
అంబటి పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టు కు పవన్ కళ్యాణ్, నాగబాబుకు ట్యాగింగ్ చేశారాయన. ఉన్నట్లు అంబటి పోస్టు వెనుక తెర వెనుక ఏమైనా మంతనాలు జరుగుతున్నాయా? అన్న చర్చ అప్పుడే మొదలైంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని గడిచిన ఏడాదిగా వైసీపీ చేయని ప్రయత్నాలు లేవు. కాసేపు పవన్, ఆ తర్వాత చంద్రబాబు, ఇంకొంత సేపు బీజేపీని పైకి ఎత్తే ప్రయత్నాలు చేశారు ఆ పార్టీ నేతలు. వైసీపీ ఎత్తులను ముందుగానే పసిగట్టిన కూటమి నేతలు అలర్ట్‌గా ఉన్నారు.
ALSO READ: రామ మందిరం పేరుతో రూ.32 లక్షల దోపిడీ.. వెలుగులోకి సంచలన నిజాలు
సమయం, సందర్భం వచ్చినప్పుడు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ‘హరిహర వీరమల్లు’ మూవీ విషయంలో సరదాగా అంబటి ఓ రాయి వేశారని అంటున్నారు. దానికి పవన్ కల్యాణ్ కనెక్ట్ అయితే లిక్కర్ కేసులో ఉపశమనం పొందవచ్చని ఆ పార్టీ నేతల అంచనా చెబుతున్నారు.
అంబటి పోస్టుపై పవన్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. నువ్వు కోరుకున్నా, కోరుకోపోయినా పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ అవుతుంది, అలాగే కనక వర్షం కూడా కురిపిస్తుందని అంటున్నారు.
వైసీపీ శ్రేణులు ఇదివరకే పవన్ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపు ఇచ్చారు. దీనిపై గడిచిన రెండుమూడు రోజులుగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ సమయంలో అంబటి పోస్టు చేయడంపై ఆసక్తికరంగా మారింది. ఏమో రేపటి రోజున ఏమైనా జరగవచ్చేమోనని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ గారి
"హరిహర వీర మల్లు"
సూపర్ డూపర్ హిట్టై
కనక వర్షం కురవాలని
కోరుకుంటున్నాను !@PawanKalyan @NagaBabuOffl— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2025