E-Paper
Advertisement

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!
Advertisement

Anasuya: అందమే అసూయపడేలా తన అందచందాలతో క్రేజీ పాపులారిటీతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది అనసూయ. అందం, అభినయంతో అంతకుమించిన నటనతో ఉర్రూతలూగించే అనసూయ.. అటు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకునే అనసూయ.. తనకు నచ్చని విషయం ఏదైనా జరిగింది అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంలో ఏమాత్రం వెనుకాడదు. అంతేకాదు కొంతమంది హిందూ ధర్మం పేరిట దేవుళ్లను ఉపయోగించుకుంటున్నారు అని, సనాతన ధర్మం విలువలు తెలియకుండా మాట్లాడుతున్నారు అంటూ చేసిన కామెంట్లకు.. పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఒక్క పోస్ట్.. హేటర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్..

ముఖ్యంగా అనసూయను టార్గెట్ గా చేసుకొని కొంతమంది అదే పనిగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ గుప్పించారు. రకరకాల మీమ్స్ క్రియేట్ చేశారు. ఆమె పరువు తీసే ప్రయత్నం కూడా చేశారు. అంతేకాదు ఆమె వెళ్లాల్సిన షాపింగ్ మాల్స్ ఓపెనింగ్లను కూడా ఆపేశారు. అయితే ఎక్కడా అనసూయ తగ్గలేదు.. గోడకు కొట్టిన బంతి వేగంగా తిరిగి వచ్చినట్టు మళ్లీ రెట్టింపు వేగంతో తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లి.. తన క్రేజ్ ఏంటో తన హేటర్స్ కి చూపించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

అభిమానుల కోలహాలాలతో ఉప్పొంగిపోయిన అనసూయ..

Advertisement

ఇస్నాపూర్ లో ఒక క్లాత్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళిన ఈమె.. అక్కడ తనను చూడడానికి వచ్చిన అభిమానుల కేరింతలతో ఉప్పొంగిపోయింది.. ట్రెండింగ్ లో నిలిచిన ‘బాసింగ బలాలే’ పాటకు స్టెప్పులేసి మరీ అభిమానులను సంతోషపరిచింది. అంతేకాదు ఎవరైతే తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారో.. ఈ ఒక్క ఓపెనింగ్ తో మళ్లీ వారందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనసూయ.. ఏది ఏమైనా అనసూయ ఎప్పటికప్పుడు రెట్టింపు వేగంతో బౌన్స్ అవుతూ.. తనను తాను నిరూపించుకుంటూ ఆడియన్స్ లో తన క్రేజ్ ఏ పాటిదో నిరూపిస్తోంది.

గ్లామర్ డోస్ పెంచేసి కుర్రకారుకు కిక్ ఇచ్చిన బ్యూటీ..

ఇకపోతే ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళిన అనసూయ ధరించిన చీరకట్టు ఫోటో స్టిల్స్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో భాగంగా వారు డిజైన్ చేసిన పింక్, గోల్డెన్ కలర్ కాంబినేషన్ పట్టుచీరను ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో గౌరీ నాయుడు డిజైన్ చేసిన గ్రీన్, పింక్ డీప్ రౌండ్ నెక్ బ్లౌజ్ ధరించి తన గ్లామర్ తో పిచ్చెక్కించింది . ముఖ్యంగా బ్యాక్ ఫోజులతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది అనసూయ.

Advertisement

also read:

చీరకట్టులో అందాలు వలకబోసిన అనసూయ..

ఈ అవుట్ ఫిట్ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ గా బుట్ట కమ్మలు ధరించిన ఈమె.. పింక్, స్కై బ్లూ, గ్రీన్ కలర్ కాంబినేషన్లో వెల్వెట్ బ్యాంగిల్స్ ధరించి, తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. కాటుక కళ్ళతో అభిమానుల హృదయాలను దోచుకుంది. ఈ షాపింగ్ మాల్ సందర్భంగా అనసూయ తన ఫోటోలను షేర్ చేస్తూ ఇలా క్యాప్షన్ ఇచ్చింది.” మీ రాక కోసం వచ్చాను. కృతజ్ఞతా భావంతో వెనుతిరిగాను. ఇస్నాపూర్.. ఒక అమ్మాయికి తిరుగులేని శక్తిని ఎలా ఇవ్వాలో మీకు బాగా తెలుసు..ఇంత ఘాఢంగా ప్రేమించబడడం నేను ఎప్పటికీ తేలికగా తీసుకోలేని ఒక వరం.. నన్ను గుర్తించినందుకు.. నా మాట విన్నందుకు.. ఎన్నడూ లేనంత బలంగా అనిపించేలా చేసినందుకు కృతజ్ఞతలు అంటూ క్యాప్షన్ జోడించింది. మొత్తానికైతే ఈ ఒక్క ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో అనసూయ హేటర్స్ అందరికీ భారీ కౌంటర్ పడింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Big Stories

Advertisement
×