Aakash Chopra on Shivam Dube impact: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో ( Asian Games 2026 Tournament Finals) పాకిస్తాన్ జట్టును టీమిండియా ఓడించి, గోల్డ్ మెడల్ దక్కించుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం వెనుక చక్రం తిప్పింది శివం దూబేనని, అతడే అసలైన ఇంపాక్ట్ ప్లేయర్ అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra on Shivam Dube) అభిప్రాయ పడ్డారు. అభిషేక్, తిలక్ కాదు…శివం దూబే వల్లే టీమిండియాకు గోల్డ్ మెడల్ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ శివం దూబే క్రెడిట్ మొత్తాన్ని టీమిండియాలోని మిగతా ప్లేయర్లు లాగేసుకుంటున్నారని సీరియస్ అయ్యారు. గోల్డ్ మెడల్ వచ్చిందంటే దానికి ఆల్ రౌండర్ దూబే కారణమని బల్లగుద్ది చెప్పారు. కానీ అతడు ఫైనల్స్ సందర్భంగా ఆడిన ఇన్నింగ్స్ ను అందరూ మర్చిపోతున్నారని ఆగ్రహించారు. అతడే లేకుంటే టీమిండియా కచ్చితంగా ఓడిపోయేదని వ్యాఖ్యానించారు. దీంతో శివం దూబేపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra ) చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో ( Asian Games 2026 Tournament Finals) పాకిస్తాన్ పై శివం దూబే అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడినట్టు ఆకాశ్ చోప్రా ప్రశంసించారు. చివరలో వచ్చిన శివం దూబే, 15 బంతుల్లోనే 27 పరుగులు చేశాడని తెలిపారు. ఇందులో 2 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయని వెల్లడించారు. అతడు చేసిన ఆ పరుగులే టీమిండియా బతికి బయట పడేశాయని చెప్పుకొచ్చారు. సిక్సర్లు కొట్టడంలో శివం దూబేను మించినోడు లేడన్నారు. జపాన్ లో స్పిన్ ట్రాక్స్ అతడికి అనుకూలించాయని, స్పిన్నర్లను దూబే చెడుగుడు ఆడుకుంటాడని స్పష్టం చేశారు.
టీమిండియా కోసం చాలా కష్ట పడినా, శివం దూబేకు సరైన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాటర్ గా, అటు బౌలర్ గా అన్ని రకాలుగా టీమిండియా ప్రత్యేక వనరుగా ఉంటున్నాడని వెల్లడించారు. హార్ధిక్ పాండ్యా లేని సమయంలో టీమిండియాకు మంచి ఆల్ రౌండర్ గా దూబే పనికొస్తున్నట్టు కితాబు ఇచ్చారు. అలాంటోడు మొన్నటి ఫైనల్స్ లో ( Asian Games 2026 Tournament Finals) అద్భుతంగా ఆడితే ఎవరూ గుర్తించలేదన్నారు. అతడు 27 పరుగులు చేయకుండా ఉండింటే, హసన్ నవాజ్ మ్యాచ్ ఎగురేసుకుని వెళ్లేవాడని హెచ్చరించారు అకాశ్ చోప్రా. కానీ ఈ విషయాన్ని ఎవరూ గ్రహించడం లేదని ఫైర్ అయ్యారు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ జపం మాత్రమే చేస్తున్నట్టు ఆగ్రహించారు.