Anasuya Bharadwaj:అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్టీఆర్ (NTR ) హీరోగా నటించిన ‘నాగ’ సినిమా ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసిన అనసూయ.. చదువు పూర్తయ్యాక న్యూస్ రీడర్గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత జబర్దస్త్ (Jabardast ) లోకి యాంకర్ గా అడుగుపెట్టింది. అక్కడ తన నటనతో, పర్ఫామెన్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. గ్లామర్ బ్యూటీగా కూడా పేరు దక్కించుకుంది. ఇక ఇక్కడ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో కమెడియన్స్ తో కలిసి పంచులు వేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె దాదాపు 9 సంవత్సరాల పాటు జబర్దస్త్ లో కొనసాగి, ఆ తర్వాత జబర్దస్త్ కి శాశ్వతంగా దూరమైంది.
షో లతో పాటు సినిమాలతో కూడా భారీ గుర్తింపు..
ఇక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా సినిమాలపై ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఒకప్పుడు సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగమ్మత్త’ పాత్రలో నటించి, తన అద్భుతమైన పాత్రతో చెరగని ముద్ర వేసుకుంది. ఇక అంతే కాదు ‘రజాకార్’ సినిమాతో మరో సంచలనం సృష్టించిన అనసూయ.. ‘పుష్ప’ సినిమాలో ద్రాక్షాయినిగా పేరు సొంతం చేసుకుంది. అటు పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయింది అనసూయ. ఇక ప్రస్తుతం ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’అనే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది.
అనసూయ గృహప్రవేశం.. కొత్తింటి పేరేంటో తెలుసా?
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలు షేర్ చేసే అనసూయ.. తాజాగా కొత్త ఇంటిలోకి అడుగు పెట్టింది. తన భర్త పిల్లలతో కలిసి సాంప్రదాయంగా గోమాతను ఇంట్లోకి ఆహ్వానిస్తూ.. గృహప్రవేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ప్రస్తుతం తన కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను అనసూయ షేర్ చేయడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఫోటోలలో అనసూయ , ఆమె భర్త భరద్వ ఇద్దరు కలిసి దేవుడి ప్రతిమలతో కుడికాలు పెట్టి మరీ గృహప్రవేశం చేశారు. ఈ ఇల్లు చూస్తే అత్యంత ఖరీదైన లాగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ లగ్జరీ ఇంటి కోసం ఆమె ప్రత్యేకంగా ఒక పేరును కూడా పెట్టింది.అనసూయ తన కొత్త ఇంటికి.. ‘శ్రీరామ సంజీవని’ అని నామకరణం చేసింది.
అనసూయ లగ్జరీ ఇల్లు.. ఖరీదు ఎంతంటే..?
“ఆ సీతారామ ఆంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో.. మీ అందరి ప్రేమతో.. మా జీవితంలో మరో అధ్యాయం మొదలయ్యింది. మా కొత్త ఇంటి పేరు ‘శ్రీరామ సంజీవని’.. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఫోటోలతో పాటు తన మనసులోని భావాలను పంచుకుంది అనసూయ. ఇక ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ కొత్త ఇంటి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ ఇంటి ఖరీదు విషయానికి వస్తే.. సుమారుగా రూ.50 నుండి రూ.80 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అనసూయ తన హోదాకు తగ్గట్టుగా ఈ ఇంటిని అత్యంత సుందరంగా, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మరీ ఈ ఇంటిని తన అభిరుచికులకు తగ్గట్టుగా నిర్మించుకున్నట్లు తెలుస్తోంది .మొత్తానికి అయితే అనసూయ కొత్త ఇల్లు చాలా అద్భుతంగా ఉంది అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Nandamuri Family: నందమూరి వారి ఫ్యామిలీ పంచాయతీ… ఇది ఇంకా చల్లారలేదా..?