Nandamuri Family: స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr .NTR) కుటుంబానికి ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇటు రాజకీయంగా కూడా ఈ కుటుంబం చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా ఈ కుటుంబం నుంచి వచ్చిన చాలామంది అటు ఇండస్ట్రీలో 24 ఫ్రేమ్స్ లో ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో సెటిలైపోయారు. కొంతమంది రాజకీయాల్లో చలామణి అవుతుంటే, మరికొంతమంది వివిధ వ్యాపార రంగాలలో సత్తా చాటుతున్నారు. ఇకపోతే మరొకవైపు బాలకృష్ణ (Balakrishna), ఎన్టీఆర్ (NTR), కళ్యాణ్ రామ్(Kalyan Ram) వంటి వారు ఇండస్ట్రీలో సత్తా చాటుతూ.. స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే అంతా బాగానే ఉన్నా ఈ కుటుంబంలో గొడవలు ఎప్పటికప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా నందమూరి, నారా ఫ్యామిలీ ఒకటిగా కలిసిపోయి.. హరికృష్ణ (Harikrishna) వారసులైన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లను దూరం పెట్టారనే వార్త ఎప్పటికప్పుడు స్పష్టం అవుతూనే ఉంటుంది.
నందమూరి ఫ్యామిలీలో గొడవలు ఇంకా చల్లారలేదా..?
అటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ బాబాయ్ బాలకృష్ణను దూరం పెట్టారని కొన్ని వార్తలు వినిపిస్తుంటే.. మరొకవైపు బాలకృష్ణ వీరిద్దరిని తమ ఫ్యామిలీలో కలుపుకోవడం ఇష్టం లేక దూరం పెట్టారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి అంతేకాదు వీరి ప్రవర్తన కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తూ వుంటుంది కూడా. అయితే సడన్ గా మొన్న లండన్ లో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ వేదికపై ఎన్టీఆర్ తన బాబాయ్ బాలయ్య అంటూ సంబోధించి అభిమానులలో ఆనందాన్ని కలిగించారు. మరొకవైపు ఇటు లోకేష్ కూడా ఎన్టీఆర్ ఫ్లెక్సీ తో సందడి చేశారు.ఇక ఇది చూసిన అభిమానులందరూ హమ్మయ్యా.. నందమూరి ఫ్యామిలీ కలిసి పోయింది. ఇక గొడవలు లేవు.. అంతా శుభమే అని అనుకునేలోపే మళ్ళీ ఒక వార్త తెరపైకి వచ్చింది.
సొంత అన్న కొడుకు కార్యక్రమానికి రాని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్..
అసలు విషయంలోకి వెళ్తే.. నందమూరి కుటుంబం నుండి ఫోర్త్ జనరేషన్ కిడ్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేశారు. వైవిఎస్ చౌదరి (YVS Chaudhary) దర్శకత్వంలో వస్తున్న సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. నిన్న చాలా ఘనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. కానీ ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాకపోవడంతో అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ సిటీలో లేడు ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం లండన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం సిటీ లోనే ఉన్నాడు. ఇంత పెద్ద వేడుక జరుగుతున్నా.. కళ్యాణ్ రామ్ ఎందుకు రాలేదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత అన్న కొడుకు ఫంక్షన్ కి రాలేనంత కార్యాలు ఏం వెలగబెడుతున్నాడు అంటూకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది రావడానికి తీరిక లేకపోతే కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా విషెస్ చెప్పాలి కదా అంత తీరరాని పని ఏముంది అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అటు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అభిమానులు మాత్రం ఆహ్వానం అందితేనే కదా వెళ్లడానికి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికివారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే నిన్న జరిగిన కార్యక్రమానికి నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ రాకపోవడం పై ఈ కుటుంబంలో గొడవలు ఇంకా చల్లారలేదా అనే కోణంలో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఈ విభేదాలకు కారణం.. ఎన్టీఆర్ ఘాటు వద్ద జరిగిన సంఘటనను ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మర్చిపోలేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు నివాళులర్పించడానికి ఎన్టీఆర్ వెళ్ళగా.. అక్కడ ఆయన సహచరులు ఎన్టీఆర్ కు జేజేలు కొడుతూ.. ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ కొద్దిసేపటికి బాలకృష్ణ వచ్చి వెంటనే తీసేయండి అని చెప్పడంతో ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్లెక్సీలు అన్నింటిని తొలగించడం జరిగింది. ఇక అక్కడ మొదలైన ఈ వివాదం ఇంకా చల్లారలేదేమో అన్నట్లుగా నిన్న జరిగిన విషయాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏది ఏమైనా ఈ నందమూరి కుటుంబం అంతా ఎప్పుడు ఒకటవుతుందో చూడాలని అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ALSO READ:Sankranthiki Vasthunnam: ఈ ఏడాది ఆమె ఉత్తమ నటి.. మరి మీనూ సంగతేంటి.?