Anchor Rashmi Gautam: జబర్దస్త్ యాంకర్ గా, సినీ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న యాంకర్ రష్మి గౌతమ్ ( Rashmi Gautam) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మూగజీవులకు సపోర్టుగా నిలుస్తూ.. అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీధి కుక్కలకు తన మద్దతు తెలుపుతూ.. వాటిని ఎవరైనా బాధ పెట్టినట్లు తన దృష్టికి వస్తే ఏమాత్రం ఆలోచించకుండా అధికార వర్గాలను సైతం ప్రశ్నిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక బాలుడు కుక్క కాటుతో రేబీస్ వ్యాధి సోకి మరణించగా.. ఈ విషయంపై ఒక నెటిజన్ రష్మి ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించాడు. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.
కుక్కల గురించి పోరాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న రష్మి తో ఒక నెటిజన్.. “కుక్కల నుంచి సోకే రేబీస్ వ్యాధితో ఒక బాలుడు మృతి చెందాడు. కుక్కల గురించి పోరాడే మీరు ఆ బాలుడి మరణం పై ఏం చెబుతారు?” అని సూటిగా ప్రశ్నించారు. ఇక నిత్యం కుక్కల గురించి ఆరాటపడుతూ, వాటికై పోరాడే రష్మి ఇప్పుడు ఏం సమాధానం చెబుతావని? ఆ నెటిజన్ సూటిగా ప్రశ్నించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఆ నెటిజన్ ప్రశ్నకు ఆమె ఏకంగా అధికారులను ప్రశ్నించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తాజాగా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక సుదీర్ఘ పోస్టు పంచుకుంది రష్మి.. “నన్ను నిందించండి.. కించపరచండి .. దూషించండి.. నేను అసలు పట్టించుకోను. కానీ ప్రభుత్వ అధికారులను ప్రశ్నించడం ఎప్పుడు మొదలుపెడతారు? అసలు ప్రజాధనం ఎక్కడికి వెళ్తుంది? జంతు సంరక్షణ కేంద్రాలు ఎందుకంత దారుణమైన స్థితిలో ఉన్నాయి? ప్రభుత్వ పశు వైద్యశాలల్లో సరైన వసతులు, పరికరాలు ఎందుకు ఉండడం లేదు? వీధి కుక్కలు, పిల్లులకు ఎందుకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు, టీకాలు వేయడం లేదు? ఆవులు, గేదెల యజమానులకు సరైన అవగాహన, మార్గదర్శకాలను ఎందుకు అందించడం లేదు? అటవీ జంతువులు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి? అంటూ వరుసగా ప్రశ్నలు సంధించింది రష్మి.
also read: మిథిలేష్ రెడ్డి వర్సెస్ రామకృష్ణ.. బిగ్ బాస్ లోకి వెళ్లేదెవరు?
అక్కడితో ఆగకుండా..” ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు పచ్చదనం అనేది మిగులుతుందా? సొంత ప్రయోజనాల గురించి పక్కన పెట్టండి.. నా పేజీలోకి వచ్చి కీబోర్డ్ వారియర్ లా పోరాడితే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కనీసం నా దృష్టి కూడా మీపై పడదు.. మీ సమయాన్ని, శక్తిని సరైన మార్గంలో ఉపయోగించి వ్యవస్థను ప్రశ్నించడం మొదలు పెట్టండి” అంటూ రష్మి హితవు పలికింది. కేవలం ఆన్లైన్లోకి వచ్చి వాదించుకోవడం మానేసి మార్పు కోసం అధికారులను నిలదీయాలి అంటూ రష్మీ ప్రజలకు పిలుపునిచ్చింది. జంతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణపై రష్మి చేసిన ఈ వ్యాఖ్యలకు నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా సమయాన్ని, శక్తిని వివేకంతో సరిగా ఉపయోగించండి అంటూ రష్మి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Shame me
Degrade me
Abuse me
I really don't care
But if you don't start questioning the authorities the real question
Where is the money going ?
Why are animal shelters in such terrible conditions?
Why are govt vet hospitals not well equipped?
Why are the street dogs and…— rashmi gautam (@rashmigautam27) September 25, 2026