Supernatural Horror Thriller: సూపర్‌నేచురల్ హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాగా ‘అగధ’ తెరకెక్కిన విషయం తెలిసిందే. కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూవీకి ఓటీటీలో బాగానే రెస్పాన్స్ వస్తోంది. భయంకరమైన గుహలు, మిస్టరీగా జరిగే వింత సంఘటనలు, దైవశక్తికి దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటం లాంటి అంశాలతో ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒక మంచి అనుభూతిని అందిస్తుంది. మరి ఈ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్‌లో అసలు రహస్యం ఏంటి? ఎక్కడ చూడవచ్చు అనే వివరాల్లోకి వెళ్తే..
కొన్ని ప్రదేశాలు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా… వాటి వెనుక చాలా కాలంగా దాగి ఉన్న కథలు ఉంటాయి. అలాంటి ఓ రహస్యమైన ప్రాంతం చుట్టూ ‘అగధ’ కథ తిరుగుతుంది. అక్కడి గుహలు, గతంలో జరిగిన కొన్ని ఘటనలు, వాటితో ముడిపడిన నమ్మకాలు కథకు కీలకంగా మారతాయి. ఓ గుహకు సంబంధించిన భయంకరమైన విషయాలు బయటకు వస్తాయి. అక్కడికి వెళ్లిన కొందరు తిరిగి కనిపించకపోవడంతో ఆ ప్రాంతం గురించి భయం మొదలవుతుంది. అసలు వాళ్లకు ఏం జరిగింది? గుహలో ఏదైనా ప్రమాదం ఉందా? లేక మనుషులకు అర్థం కాని శక్తి అక్కడ ఉందా? అనే అనుమానాలు మొదలవుతాయి.
ఇదే సమయంలో గర్భిణీ మహిళకు సంబంధించిన ఓ విషాదకరమైన సంఘటన కూడా కథలోకి వస్తుంది. ఆమె ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు, ఆ ఘటనకు ఆ ప్రాంతంతో ఉన్న సంబంధం… కథను మరో దిశలోకి తీసుకెళ్తాయి. గతంలో జరిగిన సంఘటనలు ప్రస్తుత పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయనే విషయం క్రమంగా బయటపడుతుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ దైవశక్తి, దుష్టశక్తి మధ్య ఉన్న పోరాటం ప్రధానంగా మారుతుంది. ఒకవైపు చెడు శక్తి ప్రభావం పెరుగుతుంటే… మరోవైపు దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా కథలోకి వస్తుంది. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న పాత్రలు తమ ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా అసలు రహస్యాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. గుహలోకి వెళ్లిన వాళ్లకు ఏం జరుగుతుంది? గర్భిణీ మహిళ విషాదానికి అసలు కారణం ఏంటి? అక్కడి దుష్టశక్తిని ఎవరు మేల్కొలిపారు? దాన్ని ఆపగలిగారా? అనే ప్రశ్నలతో సినిమా ఉత్కంఠగా సాగుతుంది.
కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, శ్రేయా రాణి రెడ్డి తదితరులు నటించిన ‘అగధ’కు ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించారు. ఇది తెలుగు హారర్, సూపర్‌నేచురల్ థ్రిల్లర్. 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జీ5 (ZEE5)లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: అమ్మాయిలతో ప్రతీ రాత్రి ఆ పని… ఆ గోడల మధ్య దాగున్న భయంకరమైన రహస్యం… డార్క్ డిస్టోపియన్ థ్రిల్లర్