E-Paper
Advertisement

మిథిలేష్ రెడ్డి వర్సెస్ రామకృష్ణ.. బిగ్ బాస్ లోకి వెళ్లేదెవరు?

మిథిలేష్ రెడ్డి వర్సెస్ రామకృష్ణ.. బిగ్ బాస్ లోకి వెళ్లేదెవరు?
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్.. ఈసారి వైల్డ్ కార్డు ద్వారా సెలబ్రిటీలు, కామనర్స్ ఒకేసారి 8 మంది హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ ఒక్కొక్కరిగా హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్ ని పంపిస్తున్నారు బిగ్ బాస్. అందులో భాగంగానే నిన్నటి ఎపిసోడ్ లో అగ్నిపరీక్ష సీజన్ 2 లో యాంకర్ గా తనదైన పెర్ఫార్మన్స్ తో జడ్జెస్ ను మెప్పించిన అపూర్వను హౌస్ లోకి పంపించి, కంటెస్టెంట్స్ ను టెన్షన్ కి గురిచేసిన బిగ్ బాస్.. ఇప్పుడు మరో ఇద్దరి మధ్య పోటీ పెట్టి నెగ్గిన వారిని హౌస్ లోకి పంపిస్తానని చెప్పారు.

మిథిలేష్ రెడ్డి వర్సెస్ రామకృష్ణ:

బిగ్ బాస్ సీజన్ 10లోకి కామనర్స్ ను ఎంపిక చేయడానికి నిర్వహించిన అగ్నిపరీక్ష సీజన్ 2 లో 15 మంది ఎంపిక కాగా.. అందులో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు మిథిలేష్ రెడ్డి. తన పెర్ఫార్మెన్స్ తో జడ్జెస్ చేత భల్లాల దేవ అనే ట్యాగ్ ను కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి మిథిలేష్ రెడ్డి హౌస్ లోకి రావడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తుండగా.. మొన్నటి వరకు ఆయనే హౌస్ లోకి వెళ్లబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మిథిలేష్ రెడ్డి వర్సెస్ రామకృష్ణ మధ్య పోటీ పెట్టారు బిగ్ బాస్.

ఇద్దరిలో గెలిచేది ఎవరు?

Advertisement

ఇద్దరిలో గెలిచిన ఒక్కరిని మాత్రమే హౌస్ లోకి పంపిస్తానని, ఆ సత్తా ఎవరిలో ఉందో మీరే తేల్చుకోండి అంటూ ఒక టాస్క్ నిర్వహించారు. ఇద్దరూ పోటాపోటీగా పోటీ పడ్డట్లు ప్రోమోలో చూపించారు. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గారు? ఎవరు హౌస్ లోకి అడుగు పెడుతున్నారు అనే విషయం తెలియాలి అంటే నేటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

also read: ది ప్యారడైజ్ ‘.. కేసీఆర్ రోల్ పై రాహుల్ రామకృష్ణ ట్వీట్!

రోహిత్ తో అపూర్వ లవ్ ట్రాక్.. షాలిని పరిస్థితి?

Advertisement

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 లో రోహిత్ – అపూర్వ మధ్య లవ్ ట్రాక్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. పైగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సాంగ్ కూడా బాగా మెప్పించింది.. దీనికి తోడు అపూర్వ హౌస్ లోకి అడుగుపెట్టగానే ముఖేష్ కూడా రోహిత్, అపూర్వ కాంబినేషన్లో వచ్చిన సాంగ్ చూడాలనుకుంటున్నాను అని చెప్పగా.. ఇక్కడ వీళ్ళిద్దరూ తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ఇకపోతే వీళ్ళిద్దరూ సాంగ్ కి డాన్స్ చేస్తున్న సమయంలో షాలిని ముఖం వాడిపోయినట్టు ఆడియన్స్ గమనించారు. రోహిత్ తో అపూర్వ సెట్ అయింది. మరి షాలిని పరిస్థితి ఏంటి? అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే .. మరి కొంతమంది హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడవనుంది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వర్కౌట్ అయినా.. ఆడియన్స్ కి మాత్రం మంచి వినోదం పక్కా అనే కామెంట్లు మాత్రం వ్యక్తమవుతున్నాయి.

Related News

బిగ్ బాస్ హౌస్ లోకి అపూర్వ.. మరో కొత్త లవ్ ట్రాక్ షురూ!

బిగ్ బాస్ దేబ్జానీపై సీనియర్ నటులు బ్రహ్మానందం ప్రశంసలు!

Bramhamudi Raj : అయ్యో.. ఇదేం ట్విస్ట్.. రాజు కనిపించడా..?

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రభా అవుట్..

బాబోయ్.. ఇదేం ఖర్మరా బాబు.. సీరియల్ నటి నెటిజన్స్ స్ట్రాంగ్ కౌంటర్స్..

Karthika Deepam 2 Serial Today Episode September 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని పెట్టిన మంట కాంచన ఇంటిని కాల్చేస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు ఫుల్ హ్యాపీ.. సిగ్గుపడ్డ ప్రభా.. బాలుకు అనుమానం..

Big Stories

Advertisement
×