Sowmya Rao:..ప్రముఖ జబర్దస్త్ యాంకర్ సౌమ్యా రావు(Sowmya Rao).. సీరియల్స్ లో నటించి, ఆ తర్వాత జబర్దస్త్ (Jabardast) లోకి యాంకర్ గా వచ్చి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ.. ఆడియన్స్ ను బాగా అలరించింది. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా జబర్దస్త్ కార్యక్రమం నుంచి సౌమ్యరావు తప్పుకోవడంతో ఆమె స్థానంలో కొద్ది రోజులు సిరి హనుమంతు (Siri Hanumanth)చేసింది. ఇప్పుడు జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండింటిని ఒకటే షో గా చేసి.. ప్రసారం చేస్తున్న నేపథ్యంలో సిరి హనుమంతు కూడా తప్పుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ గౌతమ్(Rashmi Gautam) మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
హైపర్ ఆది పై సౌమ్యా రావు కామెంట్స్..
ఇకపోతే ఇదే జబర్దస్త్ షోలో కమెడియన్ గా పనిచేస్తున్న హైపర్ ఆది (Hyper Aadi) తన డబుల్ మీనింగ్ డైలాగులతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఒక్కసారి మొదలు పెడితే కామెడీ పంచులు ప్రవాహంలా వస్తాయి. అయితే ఈ పంచ్ ల కారణంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్న సందర్భాలు కోకొల్లలు. అయితే ఇప్పుడు ఈయనపై ప్రముఖ యాంకర్ సౌమ్య రావు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు విషయంలోకి వెళితే గతంలో రష్మీ, అనసూయ లాంటి యాంకర్స్ పైన కూడా హైపర్ ఆది ఎలాంటి కామెంట్లు చేశారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ కామెంట్స్ ఎంత వివాదం సృష్టించాయో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు యాంకర్ సౌమ్యరావుతో కూడా హైపర్ ఆది చిలిపిగా ప్రవర్తిస్తూ.. కొన్ని సార్లు అసభ్యకరమైన కామెంట్లు చేసి, కామెడీ పండించే ప్రయత్నం చేశాడు.
కొత్తగా ఏ అమ్మాయి కనిపించినా అదే చేస్తాడు..
ముఖ్యంగా సౌమ్యరావు కూడా ఆదితో చాలా క్లోజ్ గా కనిపించింది. దీంతో బుల్లితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. ఇక హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులు, అతనితో రిలేషన్ గురించి తొలిసారి ఒక ఇంటర్వ్యూలో స్పందించింది సౌమ్యరావు. ఇంటర్వ్యూలో భాగంగా హైపర్ ఆదితో మీకు ఉన్న బంధం ఏంటి? అని ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ..” హైపర్ ఆదితో నాకు ఎటువంటి బంధం లేదు. కొత్త అమ్మాయి ఎవరు వచ్చినా సరే హైపర్ ఆది అలాగే బిహేవ్ చేస్తారు. సులభంగా పులిహోర కలిపేస్తాడు. అంతేకానీ అతనితో ఎలాంటి రిలేషన్లు లేవు. అమ్మాయిలపై సెటైర్లు వేయడం, డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడం బేసిక్ టాపిక్ గా హైపర్ ఆది పెట్టుకున్నాడు” అంటూ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా కొత్త అమ్మాయి ఎవరు కనిపించినా సరే అలాగే చేస్తాడని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైపర్ ఆది విషయానికి వస్తే.. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు ఢీ వంటి షోలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమాలలో కూడా అడపాదడపా క్యారెక్టర్లు పోషిస్తున్న ఈయన..ఆ క్యారెక్టర్ తో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆది.
ALSO READ: Tamannaah Bhatia: ముసలోళ్లు వద్దు..కుర్రాళ్లే ముద్దు.. సంచలన కామెంట్లు చేసిన తమన్నా..