Anchor Suma : బుల్లితెర ఆడియన్స్ కు యాంకర్ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. ఎన్నో ఏళ్లగా బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ అందరి మనసులో చెరగని ముద్ర వేసుకుంది యాంకర్ సుమ. దాదాపు పాతికేళ్లుగా స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు సుమ కనకాల . ఇండస్ట్రీకి ఎంతో మంది వచ్చారు, వెళ్లారు కానీ సుమ మాత్రం స్పెషల్.. ఆమె చేస్తున్న ప్రతి షో సూపర్ హిట్ అవుతుంది దాంతో ఆమె ఎంత డిమాండ్ చేస్తే అంతకుమించి రెట్టింపు ఇవ్వడానికి కూడా షో నిర్వాహకులు ముందుకు వస్తున్నారు. అలా ఆమె ఇప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు. 50 ఏళ్లకు చేరువ అవుతున్నా నేటికీ తన హవా చూపిస్తూనే ఉన్నారు. యాంకరింగ్‌లో పీహెచ్‌డీ చేసిన సుమను అనుసరిస్తే ఈ ఫీల్డ్‌లో సక్సెస్ కొట్టొచ్చని కొత్త తరం అనుకుంటున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే సుమ ఏ షోలో కనిపిస్తే ఆ షో సూపర్ హిట్ అవ్వాల్సిందే.. ఇక తాజాగా సుమ గురించి ఓ యూట్యూబర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సుమ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అదే ఫిజిక్ నేమ్ మైంటైన్ చేస్తుంది ఆమె ఆరోగ్యం పట్ల అంతగా శ్రద్ధ వహిస్తుంది. వాటిని అప్పుడప్పడూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓవీడియో వైరల్అవ్వడంతో పాటుగా ఆవీడియో తో సుమ అడ్డంగా బుక్కయింది. తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహాతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమ వచ్చారు. ఈ సందర్భంగా సుమ తెచ్చుకున్న లంచ్ బాక్స్ చూసి నిఖిల్ షాకయ్యాడు. బాక్స్ ఓపెన్ చేసి ఒక్కో ఐటెంను టేస్ట్ చేస్తూ గంట షో కోసం సుమ గారు ఇంత పెద్ద క్యారియర్ తెచ్చుకున్నారంటూ సెటైర్లు వేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది..
ఇక సుమ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. రాయడానికి పుస్తకాలు చాలవు.. చదువు తర్వాత 16 ఏళ్ల వయసులోనే యాంకరింగ్ వైపు వచ్చి సత్తా చాటారు. హోస్టింగ్ కంటే ముందు కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. ఆ తర్వాత స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి, రావోయి చందమామ తదితర సినిమాల్లో నటించారు. అలాగే బాలయ్యకు చెల్లెలిగా ఓ సినిమాలో నటించింది. పలు సినిమాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైనర్ చేశారు. అలాంటి దాదాపు 20 ఏళ్ల తర్వాత లీడ్ రోల్‌లో జయమ్మ పంచాయతీ అంటూ పలకరించారు.. హీరో రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒకవైపు ఫ్యామిలీని లీడ్ చేస్తూ మరోవైపు యాంకర్ గా పలు షోలు చేస్తూ బిజీగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమకు స్టార్స్‌ను మించిన ఫాలోయింగ్ ఉంది. లేటేస్ట్ ఫోటో షూట్‌లతో రచ్చ చేస్తుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సుమ ప్రస్తుతం వరుస షోలతో బిజీగా ఉంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">