OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కి ఒక వేదికగా మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా నచ్చిన సినిమాలను చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. ఒకప్పుడు అంతగా గుర్తింపు లేని కన్నడ ఇండస్ట్రీ, కే జి ఎఫ్ తర్వాత పరిస్థితి మారిపోయింది. కన్నడ నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. 2023 లో వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్లింది. హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి లవ్ ట్రాక్ తో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో
2023 లో వచ్చిన ఈ కన్నడ యాక్షన్ మూవీ పేరు ‘కైవా'(Kaiva). ఈ మూవీకి జయతీర్థ దర్శకత్వం వహించగా, అభువనస క్రియేషన్స్‌పై రవీంద్ర కుమార్ నిర్మించారు. ఇందులో ధన్వీర, మేఘా శెట్టి ప్రధాన పాత్రలు పోషించగా, నంద, రఘు శివమొగ్గ, ఉగ్రం మంజు, జాన్వీ రాయల, కార్తీక్ జయరామ్, దినకర్ తూగుదీప సహాయక పాత్రల్లో నటించారు.ఈ మూవీకి సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ అందించారు. ఈ మూవీ డిసెంబర్ 8, 2023న విడుదల అవ్వడంతో పాటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ యాక్షన్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
దేవరాజ్ బెంగళూరు సిటీని గ్యాంగ్ స్టర్ గా ఏలుతుంటాడు. ఆ తర్వాత ఒక వ్యక్తిని చంపే విషయంలో పోలీసులకు దొరికి జైలుకు వెళ్తాడు. దేవరాజ్ జైల్లో ఉండగా చిల్లర రౌడీలు దండాలు చేయడం మొదలుపెడతారు. ఈ క్రమంలో రామ్లాల్ అనే రౌడీ అందరినీ బెదిరిస్తుంటాడు. ఈ నేరాలు చేసి అక్రమంగా డబ్బులు సంపాదించే ముగ్గురు అన్నదమ్ములైన రౌడీలను రామ్లాల్ బెదిరించి అవమానిస్తాడు. ఆ రౌడీలు రామ్లాల్ పై పగ పెంచుకుని,అతనిని ఏమైనా చేయాలనుకుంటారు. అయితే అందుకు దేవరాజ్ గ్యాంగ్ స్టర్ కావడంతో అతనికి దగ్గర అవ్వాలనుకుంటారు. దేవరాజ్ శత్రువుని చంపి, అతని దగ్గర నమ్మకం ఏర్పరచుకోవాలనుకుంటారు.
మరోవైపు హీరో ఒక జాతరలో, కబడ్డీ పోటీలలో గెలిచి తన సత్తా చాతూటాడు. ఆ జాతరలోనే సల్మా అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడి ప్రేమించుకుంటారు. అయితే ఒకరోజు దేవరాజు శత్రువుని చంపడానికి వచ్చిన ముగ్గురు అన్నదమ్ములు, సల్మాని దారుణంగా కొట్టి అఘాయిత్యం చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న హీరో, వాళ్లను ఎలాగైనా పట్టుకుని చంపుతానని శపధం చేస్తాడు. చివరికి హీరో ఆ రౌడీలపై పగ తీర్చుకుంటాడా? ఈ రౌడీలు దేవరాజ్ కు దగ్గర అవుతారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కైవా’ (Kaiva) అనే ఈ యాక్షన్ మూవీ మూవీని మిస్ కాకుండా చూడండి.