Suma Adda: సుమ కనకాల (Suma Kanakala) .. వెండితెరపై ముకుటం లేని మహారాణిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. చిన్న చిన్న షోలు మొదలుకొని పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ల వరకు సుమా ఉండాల్సిందే. అంతే కాదు ఎంతోమంది హీరోలకు లక్కీ యాంకర్ కూడా.. సుమా స్టేజ్ పై అడుగుపెట్టి మైక్ పట్టిందో లేదో ఆటోమేటిక్ గా సినిమా సగం సక్సెస్ అయిపోయినట్లే అని నమ్మేవారు కూడా లేకపోలేదు. అలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సుమ.. బుల్లితెరపై గత రెండు మూడు దశాబ్దాలుగా నిర్విరామంగా యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తోంది. ఇకపోతే అప్పుడప్పుడు తన షోలలో సరదాగా వచ్చే కంటెస్టెంట్స్ తో ఆటలు ఆడించినా.. అవి వారిని కాస్త భయపెడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా సుమా హోస్ట్గా వ్యవహరిస్తున్న కార్యక్రమం “సుమా అడ్డ..”.
భయంతో స్టేజ్ నుంచీ దూకేసిన ప్రిన్సీ..
ఈ వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఇందులో సీరియల్ హీరోయిన్స్ వచ్చి సందడి చేశారు. ముఖ్యంగా ప్రిన్సీ(Princy ), తేజస్విని (Tejaswini), ఐశ్వర్యా (Aishwarya) లతో పాటు సింధూర (Sindhura ) గెస్ట్లుగా వచ్చేశారు. గెస్ట్ గా వచ్చిన నలుగురితో సరదాగా గేమ్స్ ఆడించింది సుమ. ఇక అందులో భాగంగానే స్టేజ్ పైకి వచ్చిన నలుగురు సీరియల్స్ హీరోయిన్లతో సుమా మాట్లాడుతూ.. “మీరంతా కాసేపు కళ్ళు మూసుకుంటే.. మీకోసం స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏర్పాటు చేశాను” అంటూ నలుగురు హీరోయిన్స్ చేతుల్లో చిన్న చిన్న బాక్సులు పెట్టింది సుమ. ఇక కళ్ళు మూసుకొని నాకు భయమేస్తుంది అంటూ ప్రిన్సీ కామెంట్ చేయగా.. ఎందుకూ.. నిన్ను చూస్తే భయమేస్తుంది కానీ అంటూ సుమా నవ్వించింది. మీరు మెల్లిగా చెయ్యి లోపల పెట్టి అందులో ఉన్న ఐటెం ఏంటో నాకు చెప్పాలి అని సుమ చెప్పగానే.. సింధూర బాక్స్ ఓపెన్ చేసింది. వెంటనే కళ్ళు తెరిచి చూసిన ప్రిన్సీ బాక్స్ లో ఉన్నది చూసి ఒక్కసారిగా భయపడిపోయింది. అందులో బల్లులు, తేళ్లు కనిపించాయి. ఇక తర్వాత ఒక్కొక్కరి బాక్స్ ఓపెన్ చేయగా పాముతో పాటు మరికొన్ని జీవరాశులు కనిపించేసరికి అందరూ భయపడ్డారు. ముఖ్యంగా ప్రిన్సీ భయంతో పారిపోయింది. ఇక ఆ పామును పట్టుకొని సింధూర ప్రిన్సీ ని ఏడిపించే ప్రయత్నం చేయగా.. తట్టుకోలేక భయంతో స్టేజ్ పైనుంచి దూకేసింది ప్రిన్సీ. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇదంతా ప్రోమో కోసమే అయినా.. అవన్నీ ప్లాస్టిక్ వి కావడం గమనార్హం. మోత్తానికైతే ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ గేమ్ పేరిట ఈ ఆటలు ఏంటి సుమా.. పాపం ప్రిన్సీ భయపడి స్టేజ్ నుంచీ దూకేసిందిగా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ప్రోమో మాత్రం వైరల్ గా మారింది.
స్టేజ్ పై ర్యాంప్ వాక్ తో అగరగొట్టిన సీరియల్ హీరోయిన్..
ఇక ఆ తర్వాత ఈ సీరియల్ హీరోయిన్స్ అందరూ ర్యాంప్ వాక్ తో అదరగొట్టేశారు. హీరోయిన్స్ రేంజ్ లో నడిచి ఆడియన్స్ ను అబ్బురపరిచారు. ఇక తేజస్విని ఈ ప్రోమోలో చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ALSO READ:Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేతిలో ఆస్కార్ అవార్డ్… ఫ్యాన్స్ ఇదే సరిపెట్టుకోవాలి ఇక..!