ViewSonic Google TV: వ్యూసోనిక్ భారత మార్కెట్‌లోకి కొత్త Google TV సిరీస్‌ను తీసుకొచ్చింది. 32, 43, 50, 55, 65 అంగుళాల స్క్రీన్ సైజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఇంటి వినోదంతో పాటు ఆఫీసులు, హోటళ్లు, విద్యా సంస్థలు, షోరూమ్‌ల వంటి కమర్షియల్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ టీవీలను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వీటితో పాటు ప్రొఫెషనల్ డిస్‌ప్లేలు, ఇంటరాక్టివ్ స్క్రీన్లు, లేజర్ ప్రొజెక్టర్లను కూడా ప్రదర్శించింది.
కొత్త టీవీలు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా గూగుల్ టీవీ Ref 5.0పై పనిచేస్తాయి. ఇందులో వివిధ యాప్‌లు, స్ట్రీమింగ్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. క్రోమ్‌కాస్ట్ సపోర్ట్‌తో ఫోన్ లేదా ఇతర అనుకూల పరికరాల్లోని కంటెంట్‌ను టీవీపై నేరుగా చూడొచ్చు. HDR కంటెంట్, డాల్బీ ఆడియో, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉన్నాయి. వాయిస్ కమాండ్ల ద్వారా కొన్ని ఫీచర్లను నియంత్రించే అవకాశం ఉంటుంది.
Also Read: చీకట్లోనూ కలర్ వీడియో.. పిల్లలు, పెంపుడు జంతువుల నిఘాకు షియోమీ కొత్త 4K కెమెరా!
ఇంటి వినోదంతో పాటు బిజినెస్, కమర్షియల్ వినియోగానికి కూడా ఈ టీవీలను ఉపయోగపడేలా రూపొందించారు. ముఖ్యంగా కార్యాలయాలు, హోటళ్లు, విద్యా సంస్థలు, షోరూమ్‌లలో వీటిని ఉపయోగించవచ్చు. అయితే ప్రతి మోడల్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, కనెక్టివిటీ వివరాలను వ్యూసోనిక్ ఇంకా వెల్లడించాల్సి ఉంది.
InfoComm India 2026లో వ్యూసోనిక్ పలు ప్రొఫెషనల్ డిస్‌ప్లేలను ప్రదర్శించింది. ఇందులో LDC027G 091C డైరెక్ట్ వ్యూ LED మోడల్‌లో 0.94mm పిక్సెల్ పిచ్, 600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్, 3,840Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. మరోవైపు వ్యూబోర్డ్ IFP105UW Nలో 105 అంగుళాల స్క్రీన్, 21:9 యాస్పెక్ట్ రేషియో, 5K రిజల్యూషన్ ఉన్నాయి. స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్‌తో మీటింగ్స్, ప్రెజెంటేషన్స్‌కు ఇది ఉపయోగపడుతుంది.
ఈ కొత్త Google TV మోడల్స్ ధరలను వ్యూసోనిక్ ఇంకా ప్రకటించలేదు. ప్రొఫెషనల్ AV ఉత్పత్తుల ధరలు, పూర్తి రిటైల్ లభ్యత వివరాలు కూడా వెల్లడించలేదు. ధరలు, విక్రయ మార్గాలపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read: 8 రకాల బ్యాక్టీరియా, వైరస్‌లకు 99.9% చెక్.. షియోమీ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రత్యేకతలివే!