Sudigali Sudheer : బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ పేరు తెలిసే ఉంటుంది.. ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు స్టార్ ఇమేజిని సొంతం చేసుకున్నాడు. మెజీషియన్ గా పనిచేస్తున్న ఈయనకు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం వచ్చింది ఈ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు.. ఆ తర్వాత ఎన్నో స్కిట్లలో తన టాలెంట్ తో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులం మనసులో కమెడియన్ గా చెరగని ముద్ర వేసుకున్నాడు. తన టాలెంట్ ని గుర్తించిన దర్శక నిర్మాతలు హీరోగా అవకాశం ఇచ్చారు. అలా హీరోగా కూడా సత్తాను చాటుకున్నాడు..ఇదిలా ఉండగా సుధీర్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. వాళ్ళ ఇంట్లోకి మరో కొత్త పర్సన్ వచ్చేసారు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
సుధీర్ ఇంట సంబరాలు..
టాలీవుడ్ కమ్ హీరో సుడిగాలి సుధీర్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈయన ఇంట సంబరాలు మొదలయ్యాయి. సుధీర్‌కు సోదరి, సోదరుడు ఉన్నారు. వారు బుల్లితెరపై కొన్ని స్పెషల్ ఈవెంట్ షోస్‌లో కూడా కనిపించారు. సుధీర్ సోదరి శ్వేత తన భర్తతో కలిసి విదేశాల్లో ఉంటుండగా… ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుధీర్ తమ్ముడు రోహన్‌కు రమ్యతో వివాహం జరిగింది. మొదట వీళ్ళిద్దరికీ పాప జన్మించింది. ఇప్పుడు మరొకరు వీరిద్దరి మధ్యలోకి వచ్చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.. రమ్య, రోహన్ రీసెంట్ గా మరోసారి తల్లి దండ్రులు అయ్యారు. రమ్య తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సుధీర్ తమ్ముడు రోహన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
సుధీర్ కెరీర్ విషయానికొస్తే..
సుధీర్ నటన పై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చేసాడు. పొట్ట కూటి కోసం మ్యూజిషియన్ గా మారి ఎన్నో షోలు చేసాడు.. తన టాలెంట్ తో జబర్దస్త్ లో ఛాన్స్ సంపాదించాడు. ఆ తర్వాత ఢీ షోలో కూడా సుధీర్ సందడి చేశారు. సుధీర్ – రష్మీల రీల్ జోడి బుల్లితెరపై సూపర్ కాంబినేషన్‌గా నిలిచింది. ఇలా బుల్లితెరపై రాణిస్తూనే సుధీర్ వెండితెర బాట పట్టారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్, ఢీ షోలకు దూరమైన సుధీర్… పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు హీరోగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘3 మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడు’, ‘గాలోడు’, ‘కాలింగ్ సహాస్ర’ సినిమాలు చేశారు. ప్రస్తుతం సుధీర్ హీరోగా ‘G.O.A.T’ మూవీలలో నటించాడు. ప్రస్తుతం అతని చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది..
ఏది ఏమైనా ఎక్కడో మ్యాజిక్ షోలు చేసుకుంటూ తన టాలెంట్ ను నిరూపించుకుంటూ, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఒక్కోమెట్టు ఎదుగుతూ.. ఇప్పుడు ఈ స్థాయిలోకి రావడం అంటే మామూలు విషయం కాదు.. కెరీర్ పరంగా సక్సెస్ అయిన సుధీర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.