OTT Movie : కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు… కొన్ని చోట్ల పరిస్థితులు ఇలా కూడా ఉంటాయా ? అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ అటుంచి ఎమోషన్స్ తో లోతుగా కనెక్ట్ అవుతాము. అలాంటి సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. ఒకప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో, సమాజంలో ఆంక్షలు ఎలా ప్రభావితం చేస్తాయో ఈ సినిమాలో కొంత వరకూ చూపించారు. కన్న తల్లే పిల్లల్ని చంపుకునే పరిస్థితికి వస్తుంది. ఈ హిస్టారికల్ హారర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 1750లో ఆస్ట్రియాలో జరుగుతుంది. ఆగ్నెస్ అనే యువతి కొత్తగా వివాహం చేసుకుని, తన భర్తతో అత్త గారింటికి వస్తుంది. అయితే ఆమె భర్త ఇంట్లోని వాతావరణం, అత్త గారు పెట్టే బాధలు, సమాజంలో మహిళలపై ఉన్న మతపరమైన ఆంక్షలు ఆమెను ఒంటరిని చేస్తాయి. ఆమె జీవితం రొటీన్ పనులతో నిండిపోతుంది. కనీసం తనని ఒక మనిషిలా కూడా ట్రీట్ చేయకపోవడంతో, ఇది ఆమె మానసిక స్థితిని క్రమంగా క్షీణింపజేస్తుంది. ఈ క్రమంలో ఒక బిడ్డకి జన్మను కూడా ఇస్తుంది. ఇక ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది.
17-18 శతాబ్దాల్లో యూరప్ లో మతపరంగా ఆత్మహత్య చేసుకోవడం పాపంగా భావించేవారు. అయితే ఇతరులను చంపి మరణ శిక్షను పొందేందుకు వీలుంటుంది. ఇక ఆమెకు పుట్టిన బిడ్డకు కూడా పెద్దయ్యాక పరిస్థితి ఇలాగే ఉంటుందని భావిస్తుంది. తన బిడ్డను చంపి, తనకు మరణ శిక్షను విధించుకోవాలని అనుకుంటుంది. చివరికి ఆమె తన బిడ్డని చంపుకుంటుందా ? తాను కూడా చనిపోతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పెళ్ళి ఫిక్స్ అయ్యాక కాబోయే వాడి గురించి అలాంటి సీక్రెట్ తెలిస్తే… కీర్తి సురేష్ సస్పెన్స్ థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఆస్ట్రియన్ హిస్టారికల్ హారర్ మూవీ పేరు ‘ది డెవిల్స్ బాత్’ (The Devil’s Bath). 2024 లో వచ్చిన ఈ మూవీకి వెరోనికా ఫ్రాంజ్ సెవెరిన్ ఫియాలా దర్శకత్వం వహించారు. అంజా ప్లాష్‌గ్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీని కాథీ స్టువర్ట్ రచించిన నవల ‘సుసైడ్ బై ప్రాక్సీ ఇన్ ఎర్లీ మోడరన్ జర్మనీ’ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ ఆగ్నెస్ అనే వివాహిత చుట్టూ తిరుగుతుంది. 2024 లో 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన పోటీలో, ఈ మూవీ ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. అక్కడ గోల్డెన్ బేర్ అవార్డు కోసం పోటీ పడింది. ఈ మూవీ 97వ అకాడమీ అవార్డ్స్‌లో, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. కానీ నామినేట్ కాలేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.