Bigg boss 10 Apoorva: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తికాగా, పదవ సీజన్ కూడా ప్రారంభమైంది. పైగా 5వ వారం కూడా నేటితో పూర్తి కాబోతోంది. అలా మొదటివారం చైత్ర ఎలిమినేట్ కాగా, రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి బిగ్ బాస్ ఇచ్చిన 15 లక్షల సూట్ కేస్ ఆఫర్ ను తీసుకొని హౌస్ నుండి వెళ్ళిపోయారు. నాలుగవ వారం సృష్టి ఎలిమినేట్ కాగా, ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతోంది. అందులో మొదటిగా అపూర్వ ఎలిమినేట్ అయింది.
ఇకపోతే నేటి ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో స్టేజ్ పైకి వచ్చిన అపూర్వ హౌస్ లో ఉండే నలుగురి బండారం బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక స్టేజ్ పైకి రాగానే నాగార్జున మాట్లాడుతూ… అపూర్వ హౌస్ లో ఉండే ఒక ఐదుగురికి అక్కడ ఉన్న బిట్టర్ షాట్ ఇచ్చి వారి గురించి ఎవరికీ తెలియని ఒక చేదు నిజాన్ని బయటపెట్టు అంటూ నాగార్జున తెలిపారు. ముందుగా రోహిత్ కి అక్కడ ఉన్న చేదు జ్యూస్ ని తాగమని చెప్పి రోహిత్ గురించి ఈ విధంగా తెలిపింది అపూర్వ. “పక్కన వాళ్ళని లుక్ డౌన్ చేస్తావు.. ఎదుటివాళ్లను చాలా తక్కువ చేసి మాట్లాడినప్పుడు బాధగా అనిపిస్తుంది” అంటూ రోహిత్ గురించి పాయింట్ అవుట్ చేసి మరి చెప్పింది.
రాంప్రసాద్ తో మాట్లాడుతూ..” మీ దగ్గర నేను చాలా కన్నింగ్ నేచర్ చూసాను. స్వార్థపరులు.. ఎవరికో మంచి చేయడానికి ఇంకెవరికో చెడు చేయకండి” అంటూ రాంప్రసాద్ గురించి తెలిపింది. అలాగే శాలిని గురించి మాట్లాడుతూ.. “ఎవరో ఛాన్స్ ఇస్తే దిగినట్టు కాదు శాలిని.. నీ ఛాన్స్ కోసం నువ్వు ఫైట్ చేసి దిగు” అంటూ అపూర్వ చెబుతుండగానే.. నాగార్జున మాట్లాడుతూ..” ఇందులో కూడా దిగిపోయిందనేది నా అభిప్రాయం” అంటూ శాలిని గురించి చెప్పుకొచ్చారు. ఇకపోతే హోస్ట్ నాగార్జున చేసిన మాటలను బట్టి చూస్తే శాలిని అంత మానుప్లేట్ చేయబడుతోందా? రోహిత్ ఎలా చెబితే అలా ఆడుతోందా? అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. ఏదిఏమైనా వైల్డ్ కార్డు ద్వారా మూడవ వారం హౌస్ లోకి అడుగుపెట్టిన అపూర్వ మూడు వారాలలోనే ఇలా ఉన్నట్టుండి హౌస్ నుండి బయటకు వెళ్లిపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
also read: బలవంతం చేశారు.. ‘ మల్లీశ్వరి’ లో పాత్ర పై సింగర్ షాకింగ్ కామెంట్!
బిగ్ బాస్ హౌస్లో ఎక్కువగా అరుస్తూ మిగిలిన కంటెస్టెంట్ చేత నెగెటివిటీ మూటగట్టుకున్న ఈమె అటు నాగార్జునతో కూడా అర్ పూర్వ అని పిలిపించుకుంది. ఎక్కువగా డామినేట్ చేయాలని చూసిందనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. మొత్తానికైతే హౌస్ లోకి వచ్చి.. టాప్ ఫైవ్ వరకు వెళ్తుంది అనుకున్న అపూర్వ మూడు వారాల్లోనే కథ ముగియడంతో నెటిజన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.