Singer Smita : ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) హీరోయిన్ గా తెలుగులో నటించిన చిత్రం మల్లీశ్వరి. ఇందులో వెంకటేష్ హీరోగా నటించారు. మల్లీశ్వరిని చంపే పనిమనిషి పాత్రలో విలన్ గా తెలుగు పాప్ సింగర్ స్మిత (Singer Smita)నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించడం తనకు ఇష్టం లేదని, వారు బలవంతం చేయడం వల్ల ఆ పాత్ర చేయాల్సి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇకపోతే ఆమె చేసిన కామెంట్లను బట్టి చూస్తే అసలు ఎవరు బలవంతం చేశారు? ఆ పాత్రలో ఎందుకు నటించాల్సి వచ్చింది? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ప్రముఖ స్టార్ సింగర్ గా పేరు సొంతం చేసుకున్న స్మిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నాటి విషయాలను గుర్తు చేసుకుంది.” మల్లీశ్వరి మూవీ కథ విన్నప్పుడే ఆ పాత్ర వద్దని నిర్ణయించుకున్నాను. నాకు నటన మీద పెద్దగా ఆసక్తి లేదు. అందులోనూ ఆ నెగటివ్ పాత్ర చేయడం అసలే ఇష్టం లేదు. నిజానికీ గతంలో ఎన్నో మంచి సినిమాలు వచ్చినప్పటికీ, నటన మీద ఇష్టం లేకే తిరస్కరించాను. అయితే నా చుట్టూ ఉన్నవారు, ప్రత్యేకించి నా కుటుంబ సభ్యుల ఒత్తిడితో మల్లీశ్వరి చిత్రంలో నటించాల్సి వచ్చింది.. పైగా ఆ సినిమా చేయడం నా జీవితంలో నేను తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయం అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను.
ఇకపోతే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ చాలా మంచి వ్యక్తులు. నా అసంతృప్తి సినిమా బృందం పైన కాదు ఆ పాత్రలో నటించడం పై అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది స్మిత.. మొత్తానికి అయితే తనకు నటన అంటే ఇష్టం లేదని, పైగా విలన్ షేడ్స్ లో నటించడం అంటే అసలే ఇష్టం లేదని, అయినా సరే కుటుంబ సభ్యుల బలవంతం వల్లే తాను ఆ పాత్రలో నటించి ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను అంటూ స్మిత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించని స్మిత.. సిద్ధార్థ హీరోగా వచ్చిన ఆట చిత్రంలో హేలో హేలో అనే స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
also read: త్రిగుణ్ కూతురిపై అపూర్వ కామెంట్..హద్దులు దాటుతున్న మాటలు!
సింగర్ స్మిత కెరియర్ విషయానికి వస్తే.. తెలుగు పాప్ సింగర్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న స్మిత ఎక్కువగా తెలుగు పాత పాటలను రీమిక్స్ చేసిన గాయనిగా ప్రసిద్ధి పొందింది. మంచి సింగర్ గానే కాకుండా నటిగా కూడా పేరు తెచ్చుకున్న ఈమె వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టింది.. 2002లో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ అనే పేరుతో బ్యూటీ సెలూన్ కూడా ప్రారంభించింది. అలాగే 2006లో విజయవాడలో కూడా అదే పేరుతో సెలూన్ ప్రారంభించిన స్మిత.. ఫిట్నెస్ సెంటర్ ని కూడా ప్రారంభించింది. ఐ కాండి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మరో సంస్థను ప్రారంభించిన ఈమె టీవీ కార్యక్రమాలు కూడా రూపొందిస్తోంది. అంతేకాదు జీ తెలుగు సరిగమ పాటల పోటీల కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించిన స్మిత.. ఒకానొక సమయంలో సోనీ లీవ్ లో నిజం విత్ స్మిత అనే టాక్ షో కూడా నిర్వహించింది.