Bigg Boss 10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఏడు వారాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. 8వ వారం కూడా అప్పుడే వీకెండ్ కి చేరుకుంది. మరి ఈ వీకెండ్ లో భాగంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు? డేంజర్ లో ఉన్నది ఎవరు? అనే విషయాలు ఆడియన్స్ లో క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఆటను బట్టి చూస్తే.. ఈవారం కూడా వర్షిణి (Varshini) సేఫ్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి హౌస్ లో పెద్దగా పెర్ఫార్మన్స్ కనపరచకపోయినా.. టాస్క్లలో తనదైన టాలెంట్ ను చూపించకపోయినా.. ప్రతి వారం ఈమెను బిగ్ బాస్ సేఫ్ చేస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వారం వర్షిణి తో పాటు ఎవరెవరు సేఫ్ జోన్ లోకి వచ్చారో ఇప్పుడు చూద్దాం.. బిగ్ బాస్ సీజన్ 10లో 8వ వారం మరింత ఆసక్తిగా మారింది. రోజుకో కొత్త మలుపుతో కంటెస్టెంట్ల మధ్య పోటీ కూడా పెరుగుతోంది. ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో జరుగుతున్న బిగ్ బాస్ హోటల్ టాస్క్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగానే కంటెస్టెంట్లను రెడ్, ఎల్లో, గ్రీన్ లెవెల్స్ గా విభజించి, వారికి వేరువేరు బాధ్యతలు అప్పగించారు. రెడ్ జోన్ లో ఉన్నవారు హోటల్ వర్కర్స్ గా , ఎల్లో జోన్లో ఉన్నవారు యజమానులుగా, గ్రీన్ జోన్ లో ఉన్నవాళ్లు అతిథులుగా వ్యవహరించారు. ఇకపోతే ఈ విభజన హౌస్ లో పోటీతో పాటు వినోదాన్ని కూడా పెంచింది.. ప్రతి ఒక్కరు కూడా తమ జోన్ మార్చుకోవడానికి చాలా గట్టిగానే ప్రయత్నించారు.
అలా ఈ వారం టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆటను పరిచయం చేశారు. రెండు జట్లుగా విడిపోయిన కంటెస్టెంట్లు.. ఈ ఆటలో పోటీపడ్డారు. ఒక్కో జట్టులో ఒక యజమాని, ఇద్దరు సిబ్బంది చొప్పున పాల్గొన్నారు. డైస్ వేయడం, వచ్చిన సంఖ్యకు అనుగుణంగా బోర్డుపై ముందుకు కదలడం.. ఈ ఆటలో ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఇకపోతే కేవలం గెలుపు కోసం జరిగే పోటీగా మాత్రమే మిగలలేదు. మధ్యలో వచ్చిన సరదా పనిష్మెంట్లు కూడా హౌస్ లో నవ్వులు పూయించాయి . సుధీర్ తలకిందులుగా ఉండాల్సి రావడం.. వంశీ ఓల్డ్ ఫారెన్ మ్యాన్ గా నటించడం వంటివి కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఇకపోతే ఈ టాస్కులో అత్యధిక స్టార్స్ అందుకున్న రాంప్రసాద్ , వర్షిణి కీలక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎల్లో లెవెల్ నుండి నేరుగా గ్రీన్ జోన్ లోకి వెళ్ళిపోయారు. దీంతో ఈ వారం ఎదురవుతున్న ఒత్తిడి నుండి వీరికి కొంత ఊరట లభించింది. ముఖ్యంగా నామినేషన్స్ ముప్పు ఉన్న సమయంలో ఈ విజయం వారికి మరింత బలంగా మారిందని చెప్పవచ్చు. ఇకపోతే వంశీ తనదైన ఆటతో మెరుగైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతడికి ఎక్కువ డబ్బులు రావడంతో రెడ్ జోన్ నుంచి ఎల్లో జోన్లోకి వెళ్లిపోయాడు.
also read:దేత్తడి హారిక నెల సంపాదన ఎంతో తెలుసా?
ఇక డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు అనే విషయానికి వస్తే.. ఈ వారం రోహిత్, వంశీ, దేబ్జాని, శివ, సుధీర్ , ఝాన్సీ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ప్రస్తుతం నామినేషన్ లో ఉన్న ఆరుగురు తమ ఆటతో ప్రేక్షకులను మెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాస్కుల్లో చివరిగా పాల్గొనడం, హౌస్ లో తమ ప్రవర్తనతో ఆకట్టుకోవడం, ఇప్పుడు వాళ్ళకి కీలకంగా మారింది. ఇక మరొకవైపు రాంప్రసాద్ వర్షిని తొలిసారి కష్టపడితే గ్రీన్ జోన్ లోకి వెళ్లారు అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వారం ఎలిమినేషన్ లో ఎలాంటి ట్విస్ట్ చోటు చేసుకుంటుందో చూడాలి.