Bramhamudi Raj : తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇటీవల కాలంలో సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్ జనాలను అలరిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడ వీటికి డిమాండ్ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో బోలెడు సీరియల్స్ డిఫరెంట్ స్టోరీలతో రావడంతో ప్రతి సీరియల్ కు డిమాండ్ కూడా పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా సీరియల్స్ మధ్య పోటీ పెరుగుతూ వస్తుంది. బ్రహ్మముడి సీరియల్ కు ఈ మధ్య టీఆర్పీ రేటింగ్ పూర్తిగా తగ్గిపోవడంతో ఈ సీరియల్ కు శుభం కార్డు పడుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు సీరియల్ హీరో తప్పుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. నిజంగానే రాజు తప్పుకుంటున్నాడా? లేదా అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా లో ఒకప్పుడు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోయిన సీరియల్స్ లలో ఎక్కువగా వినిపించే సీరియల్ బ్రహ్మముడి గురించి అందరికి తెలిసే ఉంటుంది. డిఫరెంట్ స్టోరీతో బ్రహ్మముడి గురించి చెప్పే ఈ సీరియల్ బుల్లితెర ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య రాజు, కావ్య చనిపోయి మళ్లీ పుట్టడం అనేది జనాలకు పెద్దగా నచ్చలేదు. దాంతో టీఆర్పీ రేటింగ్ భారీగా తగ్గిందనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడిప్పుడే కాస్త స్టోరీ ట్విస్ట్ లతో బాగుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజు అవుట్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటికే గతంలో ఇలా చాలా సార్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు నిజం అని తెలుస్తుంది. రాజు కు కొత్త సీరియల్ అవకాశాలు రావడంతో ఇప్పుడు ఈ సీరియల్ కు గుడ్ బై చెప్తున్నట్లు టాక్ నెట్టింట తెగ వినిపిస్తుంది. దీని గురించి క్లారిటీ రావాలంటే రాజు స్పందించేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఈ సీరియల్ నుంచి హీరో వెళ్ళిపోతే నెక్స్ట్ ఈ సీరియల్ కు హీరోగా వస్తాడు అన్నది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ఈ సీరియల్ కు శుభం కార్డు వేసుకుంటే మంచిది అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సీరియల్ హీరో రాజు అసలు పేరు మానస్ అన్న సంగతి తెలిసిందే.. ఈయన గతంలో అనేక సీరియల్స్ సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆయన నటించిన ప్రతి సీరియల్ మంచి క్రేజ్ ను అందించింది. ముఖ్యంగా బ్రహ్మముడి సీరియల్ అయితే మంచి టాక్ ను సొంతం చేసుకొనేలా చేసింది.