E-Paper
Advertisement

బజాజ్ పల్సర్ లో అదిరిపోయే అప్‌డేట్.. TFT స్క్రీన్‌తో కొత్త లుక్!

బజాజ్ పల్సర్ లో అదిరిపోయే అప్‌డేట్.. TFT స్క్రీన్‌తో కొత్త లుక్!
Advertisement

Bajaj Pulsar NS400Z TFT Display: బజాజ్ పల్సర్ NS400Zలో మరో క్రేజీ అప్ డేట్ తో అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే పల్సర్ N160, పల్సర్ 125, పల్సర్ 150 లాంటి మోడళ్లలో TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను తీసుకొచ్చిన బజాజ్.. ఇప్పుడు తన NS400Zలోనూ ఇదే ఫీచర్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త డిస్‌ప్లేతో ఉన్న NS400Z తాజాగా ఓ డీలర్‌షిప్‌లో కనిపించింది. దీని విడుదల కూడా త్వరలోనే ఉండొచ్చనే అంచనాలు పెరిగాయి.

కొత్తగా 5 అంగుళాల TFT డిస్‌ ప్లే

NS400Zలో కనిపించిన ప్రధాన మార్పు దాని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ప్రస్తుతం ఉన్న డిస్‌ ప్లే స్థానంలో బజాజ్ కొత్త TFT యూనిట్‌ను తీసుకురానుంది. ఇప్పటికే కంపెనీకి చెందిన ఇతర పల్సర్ మోడళ్లలో కనిపిస్తున్న ఈ డిస్‌ప్లేనే NS400Zలోనూ ఉపయోగించే అవకాశం ఉంది. కొత్త TFT స్క్రీన్ తో బైక్‌కు మరింత అద్భుతమైన లుక్ రావడంతో పాటు, రైడర్‌ కు అవసరమైన సమాచారం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది.

ఇంజిన్‌లో నో ఛేంజెస్!  

Advertisement

కొత్త డిస్‌ ప్లే వచ్చినప్పటికీ NS400Zలో పెద్ద మెకానికల్ మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 349.13cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 40.6hp పవర్, 33.2Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంటే, కొత్త అప్‌ డేట్ ప్రధానంగా టెక్నాలజీ, డిజైన్ వైపే ఉంటుందని తెలుస్తోంది. ఇంజిన్, పనితీరు, రైడింగ్ సెటప్‌లో పెద్ద మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.

కలర్ ఆప్షన్లలోనూ ఛేంజెస్

TFT స్క్రీన్‌తో పాటు NS400Zలో కొన్ని కొత్త కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం. అయితే, బైక్ మొత్తం డిజైన్‌ లో భారీ మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. బజాజ్ ప్రస్తుతం తన పల్సర్ లైనప్‌ను క్రమంగా ఆధునీకరిస్తోంది. N160 నుంచి ప్రారంభమైన TFT డిస్‌ప్లే అప్‌డేట్ ఇప్పుడు 125, 150, NS200, N250 లాంటి మోడళ్లకు కూడా విస్తరిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని బజాజ్ బైక్‌లలో ఇదే 5 అంగుళాల TFT డాష్ కనిపించే అవకాశం ఉంది.

Advertisement

అయితే, ఇటీవల పరీక్షల్లో కనిపించిన పల్సర్ NS200లో కొత్త WP ఫోర్క్ కనిపించింది. అయితే NS400Zలో మాత్రం అలాంటి అప్‌డేట్ కనిపించలేదు. KTM, Husqvarna మోడళ్లలో కనిపించే ఈ ఫోర్క్‌ ను NS400Zకు తీసుకురావండం తీసుకురాలేదని తెలుస్తోంది. అంటే, NS400Z అప్‌ డేట్‌ లో కీలకంగా TFT డిస్‌ ప్లే, కొన్ని కలర్ మార్పులపైనే ఉన్నట్లు కనిపిస్తోంది.

ధర ఎంత అంటే?

ప్రస్తుతం పల్సర్ NS400Z ధర సుమారు రూ.1.86 లక్షలుగా ఉంది. కొత్త TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కారణంగా ధరలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అయితే తుది ధరను బజాజ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Read Also: హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

Tags

Related News

రిలీజ్ కు ముందే టాటా ఏరిస్ వీడియో లీక్.. CNG మోడల్‌ లో ఇవే హైలైట్స్!

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

Big Stories

Advertisement
×