Betting Apps Case:గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో బెట్టింగ్ వ్యవహారం ఎంతలా ప్రకంపనలు సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్న సెలబ్రిటీలను టార్గెట్ చేసిన తెలంగాణ పోలీసులు.. ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తున్నారని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. బాగా పేరు మోసిన సెలబ్రిటీలు సొంత లాభం కోసం ఇలాంటి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి, వీరిని నమ్మిన చాలామంది అమాయకులు ఈ బెట్టింగ్లో డబ్బులు పెట్టి మోసపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఆత్మహత్యల సంఖ్య దాదాపు 900కు పైగా చేరడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక్కొక్కరిని విచారిస్తూ ఊబీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.
స్టే నిరాకరించిన హైకోర్టు..
ఇకపోతే ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ నుండి దాదాపు 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేయగా.. అందులో ఒకరు విష్ణు ప్రియ(Vishnu Priya)కూడా .. ఇకపోతే విష్ణు ప్రియ పై ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అవ్వగా.. దానిని కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఆ ఎఫ్ ఐ ఆర్ ను కొట్టివేయడానికి దర్యాప్తు చేపట్టిన హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ముఖ్యంగా పోలీసుల దర్యాప్తుకు విష్ణుప్రియ సహకరించాలని, ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారమే దర్యాప్తు కొనసాగించాలని అటు పోలీసులను కూడా ఆదేశించింది హైకోర్టు. దీంతో ఈ విషయంలో ఎవరిని కూడా అంత త్వరగా విడిచి పెట్టేలా కనిపించడం లేదని సమాచారం. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం చేసినందుకు మియాపూర్ పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ పై కేసు నమోదయింది. అంతే కాదు ఈమెతో పాటు పలువురు సెలబ్రిటీలపై కూడా కేసు నమోదు అవ్వగా.. కొంతమంది బాధితుల ఫిర్యాదు మేరకు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కూడా కేస్ నమోదు చేయడం గమనార్హం.
Salman Khan: పక్కటెముకలు పట్టేసి నొప్పి భరిస్తూనే ఆ పని చేశా.. సల్మాన్ ఖాన్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇరుక్కున్న సెలెబ్రిటీలు..
ఇకపోతే టాలీవుడ్లో టాప్ సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్, ప్రభాస్, బాలకృష్ణ , మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ తో పాటు యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, శోభ శెట్టి లాంటి పలువురు సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ఇప్పుడు బాగా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరందరినీ కూడా పోలీసులు ఒక్కొక్కరిగా విచారణ నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై కొంతమంది సెలబ్రిటీలు స్పందించి, తాము చట్ట ప్రకారమే అన్ని చేశామని చెబుతుంటే.. మరి కొంతమంది పోలీసులకు సహకరిస్తూ న్యాయం నిలబడడానికి ప్రయత్నం చేస్తాము అంటూ తెలిపారు. మొత్తానికైతే ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.