Big TV Kissik talks: అమర్దీప్ చౌదరి (Amardeep Choudhary) .. బుల్లితెర మాస్ మహారాజుగా పేరు సొంతం చేసుకున్న ఈయన మాస్ మహారాజా రవితేజ (Raviteja)కి వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనతో కలిసి ఒక్క ఫోటో దిగాలని పరితపించే అమరదీప్ కి.. ఏకంగా రవితేజ తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడంతో.. అదే తన అసలైన సక్సెస్ అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. నిత్యం బయటకి నవ్వుతూ కనిపిస్తూ.. నలుగురిని నవ్విస్తూ.. లోపల నరకం అనుభవిస్తున్నారు అమర్దీప్ చౌదరి. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులే ఎన్నోసార్లు చెప్పుకొచ్చిన విషయం కూడా తెలిసిందే..
ఇదిలా ఉండగా.. అందరితో సరదాగా గడిపే అమర్దీప్ సూసైడ్ వరకు వెళ్లారు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నా జీవితం మొత్తం కష్టాలమయం – అమర్దీప్
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ కార్యక్రమానికి అమర్దీప్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో ఎన్నో కన్నీళ్లు తెప్పించే మాటలు మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు అమర్దీప్. అమర్దీప్ మాట్లాడుతూ.. “నా జీవితంలోకి నా భార్య తేజు రావడం అదృష్టం. అటు మా అమ్మ నా కోసం ఎంతో కష్టపడింది. వారి ఇద్దరి వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను” అని చెప్పుకొచ్చారు. అంతేకాదు తనను చాలామంది అవమానించారు అని, వెన్నుపోటు పొడిచారు అని, అన్న చెల్లెలు బంధానికి కూడా అర్థం లేకుండా మాట్లాడారు.. చెప్పు కంటే హీనంగా చూశారు అంటూ ఎమోషనల్ అయ్యారు అమర్దీప్.
ఆత్మహత్యాయత్నం చేశాను – అమర్దీప్
ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నేను చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాను. గతంలో నేను ఏదైనా తప్పు చేసి ఉంటాను..అదే ఇప్పుడు నన్ను వెంటాడుతోంది. కర్మ కచ్చితంగా వెంటాడుతుంది అంటారు కదా.. అదే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. మానసికంగా నేను పర్ఫెక్ట్ కాదు. విపరీతమైన ట్రోల్స్, అవమానాలు, హేళనలు మరెన్నో నా జీవితంలో చవి చూశాను. అందుకే వాటన్నింటినీ తట్టుకోలేక ఒకరోజు సూసైడ్ ప్రయత్నం కూడా చేశాను” అంటూ తన జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అమర్దీప్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమర్దీప్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక పూర్తి వివరాలు తెలియాలి అంటే శనివారం సాయంత్రం 7: 00 గంటలకు బిగ్ టివి ఎక్స్క్లూజివ్ గా ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
అమర్దీప్ కెరియర్..
అమర్దీప్ విషయానికి వస్తే.. ‘జానకి కలగనలేదు’ సీరియల్ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టి టైటిల్ విన్నర్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అక్కడ తన పెర్ఫార్మన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. కానీ రన్నర్ గా నిలిచారు.. ఇక్కడ రన్నర్ అయితేనేం ఎంతోమంది మనసుల హృదయాలు దోచుకున్నారు అమర్దీప్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం సురేఖ వాణి కూతురు సుప్రీత బండారుతో కలిసి ‘చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి’ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
ALSO READ:HBD Fahad fazil: సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. కానీ గ్యారేజ్ లో కార్ కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాక్!