E-Paper
Advertisement

Thriller Movie OTT : పోస్ట్ మ్యాన్ చేతిలో చావు కబురు… కిడ్నాప్ కేసులో పిచ్చెక్కించే ట్విస్టులు

Thriller Movie OTT : పోస్ట్ మ్యాన్ చేతిలో చావు కబురు…  కిడ్నాప్ కేసులో పిచ్చెక్కించే ట్విస్టులు
Advertisement

Thriller Movie OTT : ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ తో అదిరిపోయే థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అడ్రస్ సరిగ్గా లేని ఉత్తరాల నేపథ్యంలో కథ ఊహించని రేంజ్ లో మలుపులు తిరుగుతుంది. 1980 నాటి కాలంలో అమెరికాలో అడ్రస్ సరిగ్గా లేని ఉత్తరాలను వెతికే ఒక ప్రత్యేక విభాగం ఉండేది. ఆ నేపథ్యంలో సినిమా రావడం అందరికీ చాలా కొత్తగా అనిపించింది. ఒక పోస్ట్ ఆఫీస్‌కు రక్తంతో తడిసిన ఒక వింత ఉత్తరం అందుతుంది. ఆ ఉత్తరంలో ఎవరో ప్రాణాపాయంలో ఉన్నారని, సాయం చేయమని రాసి ఉంటుంది. పోస్ట్ మ్యాన్ దీనిని కనిపెట్టే క్రమంలో స్టోరీ ఊహించని ఉత్కంఠతను ఇస్తుంది. ఈ సినిమా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది, ముఖ్యంగా దీనిలోని సస్పెన్స్, మేకింగ్ స్టైల్‌కు మంచి మార్కులు పడ్డాయి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘డెడ్ మెయిల్’ (Dead Mail). జో డిబోయర్, కైల్ మెక్కోనాఘీ అనే ఇద్దరు దర్శకులు దీనికి ప్రాణం పోశారనే చెప్పాలి. వీళ్ళు కేవలం దర్శకత్వమే కాకుండా, సినిమాకి అవసరమైన ఎడిటింగ్, మ్యూజిక్, సౌండ్ డిజైన్ కూడా స్వయంగా చేసుకున్నారు. అందుకే సినిమా అంతా ఒకే మూడ్‌లో సాగుతుంది. ఇందులో స్టెర్లింగ్ మేసర్ జూనియర్, జాన్ ఫ్లెక్, టోమస్ బాయ్కిన్ లీడ్ రోల్స్ లో నటించారు. 2024 మార్చిలో SXSW ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటిసారి ప్రదర్శించబడింది. ఆ తర్వాత 2025 ఏప్రిల్‌లో Shudder ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), Apple TV సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు కూడా ఈ సినిమాను చూడవచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ 1980ల కాలంలో మొదలవుతుంది. హీరో జాస్పర్ ఒక పోస్ట్ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. అడ్రస్ సరిగ్గా లేని ఉత్తరాలను వెతికి పట్టుకోవడం ఇతని డ్యూటీ. ఒకరోజు ఇతని చేతికి ఒక చిత్రమైన ఉత్తరం దొరుకుతుంది. ఆ లెటర్ మొత్తం రక్తం మరకలతో నిండిపోయి ఉంటుంది. అందులో ఎవరో ప్రాణాపాయంలో ఉన్నారని, సాయం చేయమని రాసి ఉంటుంది. ఆ ఉత్తరం ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలీకపోయినా, అది ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టడానికి జాస్పర్ తన పని మొదలుపెడతాడు.

అసలు విషయం ఏంటంటే, ఒక పిచ్చోడైన ట్రెంట్ అనే వ్యక్తి, సింథసైజర్లు రిపేర్ చేసే జోష్ అనే టెక్నీషియన్‌ను కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించి ఉంటాడు. జోష్ తన తెలివితేటలతో ఒక చిన్న కాగితం మీద రక్తంతో మెసేజ్ రాసి, ఎలాగోలా దాన్ని బయటకు పంపిస్తాడు. ఆ ఉత్తరమే మన జాస్పర్ చేతికి వస్తుంది. కానీ ఆ కిడ్నాపర్ ట్రెంట్ చాలా డేంజర్ పర్సన్. వాడు అస్సలు దొరక్కుండా చాలా ప్లాన్‌గా ఉంటాడు.

Advertisement

జాస్పర్ తన ఇన్వెస్టిగేషన్‌తో మెల్లమెల్లగా ఆ కిడ్నాపర్ అడ్రస్ వైపు వెళ్తుంటాడు. మరోపక్క ఆ ఇంట్లో బందీగా ఉన్న జోష్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు, ట్రెంట్ చేసే పిచ్చి పనులు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. చివరకు ఆ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి జాస్పర్ ఆ అడ్రస్ కనిపెడతాడా ? ఆ సైకో కిడ్నాపర్ ట్రెంట్ నుంచి జోష్ ని కాపాడతాడా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : చచ్చిన శవంలో నిద్రలేచే పిశాచి… పుట్టబోయే బిడ్డ కోసం వేట… క్షణక్షణం ఉత్కంఠ

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×