Big Tv Kissik Talks: బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ అనంతరం వెండి తెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న వారిలో నటుడు మహేష్ ఆచంట(Mahesh Achanta) ఒకరు. జబర్దస్త్ కమెడియన్ గా తన స్కిట్లతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన రంగస్థలం(Rangasthalam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఈ సినిమా తర్వాత మహేష్ కాస్త రంగస్థలం మహేష్ గా మారిపోయారు. ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ మహేష్ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే మహేష్ అచంట తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్యతో జరిగిన గొడవ గురించి మహేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈయన ఒక షోలో భాగంగా తన భార్యతో పెద్ద ఎత్తున గొడవకు దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అనంతరం ఆ గొడవలు నిజం కాదని మహేష్ తెలిపారు.. ఈ విషయంపై యాంకర్ వర్షా ప్రశ్న వేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. ఆ కార్యక్రమంలో తాము పాల్గొన్నాము కానీ మాకు తెలియకుండా ప్రోమోలో ఏకంగా ఫేస్ అంతా బ్లర్ చేసి విడుదల చేశారని ఆ సమయంలో తాను మా బావమరిది పెళ్లిలో ఉన్నానని తెలిపారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో చాలామంది మా ఊరి వాళ్ళు నన్ను విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు .కొంతమంది అయితే నువ్వు ఇలాంటి వాడవని అసలు ఊహించలేదు అంటూ తనని అనుమానించారని మహేష్ తెలిపారు. ఇలా తన గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా చాలామంది ఈ విషయంపై తనని కాంటాక్ట్ అయ్యారని తెలిపారు.
ఈ గొడవకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో చిరంజీవి గారి సినిమా సెట్ లో ఒక వ్యక్తి తనని ఈ విషయం గురించి అడిగారని మహేష్ తెలిపారు. అలాగే శ్రీకాంత్ సినిమా షూటింగ్ సమయంలో కూడా తనని ఈ విషయం గురించి ప్రశ్నించడంతో వామ్మో ఈ గొడవ సెలబ్రిటీల వరకు చేరిందా? అంటూ ఆశ్చర్యపోయానని మహేష్ తెలిపారు. అయితే తన భార్య తనకు స్వయాన మరదలు కావడంతో తనకేవిధమైనటువంటి సమస్యలు లేవని, ప్రతి విషయంలో చాలా అర్థం చేసుకుంటుంది అంటూ తన భార్య గురించి అలాగే గతంలో వీరిద్దరి గొడవలకు సంబంధించిన వీడియో గురించి కూడా మహేష్ ఆచంట ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఈయన ఇంకా ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం అవుతుంది.
Also Read: ఈ ఎడిటర్ కు ప్రొడ్యూసర్ కంటే బిల్డప్ ఎక్కువ.. మంచి సినిమాలను నాశనం చేస్తున్నాడుగా?