E-Paper
Advertisement

జబర్దస్త్ కార్యక్రమం పై మహేష్ అచంట కామెంట్స్.. రెండు రోజులు పని చేస్తే చాలంటూ!

జబర్దస్త్ కార్యక్రమం పై మహేష్ అచంట కామెంట్స్.. రెండు రోజులు పని చేస్తే చాలంటూ!
Advertisement

Big Tv Kissik Talks: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమానికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కామెడీ షోగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం దాదాపు 13 సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని దూసుకుపోతుంది. జబర్దస్త్ కార్యక్రమం ఇండస్ట్రీకి ఎంతోమంది కమెడియన్స్, డైరెక్టర్స్ అలాగే హీరోలను కూడా ఇచ్చిందని చెప్పాలి. ఇప్పటికి కూడా బుల్లితెరపై నెంబర్ వన్ షోగా దూసుకుపోతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి కమెడియన్ మహేష్ అచంట (Mahesh Achanta)చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందిన మహేష్ అచంట..

వెండితెరపై సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న మహేష్ అచంట తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మహేష్ అచంట కెరియర్ మొదట్లో జబర్దస్త్ కమెడియన్గా ఎన్నో అద్భుతమైన స్కిట్లను చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెండితెర అవకాశాలు అందుకున్న వారిలో మహేష్ అచంట కూడా ఒకరు. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ కార్యక్రమం గురించి వర్ష ఈ సందర్భంగా ప్రశ్నలు వేశారు.

నెల అంతా సంతోషంగా గడపొచ్చు…

Advertisement

ఈ నేపథ్యంలోనే మహేష్ అచంట జబర్దస్త్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. మల్లెమాలవారు నిర్వహిస్తున్న జబర్దస్త్ కార్యక్రమం అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లాంటిదని తెలిపారు. ఈ జబర్దస్త్ కార్యక్రమంలో రెండు రోజులు పని చేస్తే చాలు నెలకు సరిపడా డబ్బులు వస్తాయని ,ఆ డబ్బులతో నెల మొత్తం చాలా సంతోషంగా గడపొచ్చని మహేష్ అచంట తెలిపారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమాన్ని ఏకంగా గవర్నమెంట్ జాబుతో పోల్చి ఈయన మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. మల్లెమాల వారి నిర్మాణంలో ఈ కార్యక్రమం 13 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.

Advertisement

ఈ కార్యక్రమం మొదట్లో పాల్గొన్న కమెడియన్స్ ఇప్పుడు ఈ జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటూ వెండితెరపై బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమంలో నాగబాబు(Nagababu) ఇంద్రజ (Indraja)జడ్జిలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో కమెడియన్స్ గా నటిస్తున్న వారందరూ కూడా వెండి తెర సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే మరోవైపు జబర్దస్త్ షోలో కూడా సందడి చేస్తున్నారు. ఇక మహేష్ ఆచంట సినిమాలలో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో జబర్దస్త్ కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు.

Also Read: నా డైలాగ్స్ అంటే మహేష్ బాబుకి పిచ్చ ఇష్టం.. రంగస్థలం మహేష్ కామెంట్స్ వైరల్!

Related News

బిగ్‌బాస్ టైటిల్ అతను గెలిస్తే హ్యాపీ.. మహేష్ అచంట మనసులో మాట!

ఆరుగురిని లవ్ చేశా.. నా భార్యకు చెబితే .. మహేష్ అచంట లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

వాళ్లని చూస్తే కంకర రాళ్లతో కొట్టాలనిపిస్తుంది…చిరు పై మహేష్ అచంట వైరల్ కామెంట్స్

బిగ్‌బాస్‌కు వెళ్లకపోవడానికి కారణం ఇదేనా? మహేష్ అచంట ఏమన్నారంటే!

వైల్డ్ కార్డ్స్ కాదు వైల్డ్ ఫైర్.. హౌస్ లోకి అడుగుపెట్టిన స్టార్స్ వీరే!

నా డైలాగ్స్ అంటే మహేష్ బాబుకి పిచ్చ ఇష్టం.. రంగస్థలం మహేష్ కామెంట్స్ వైరల్!

ఫస్ట్ వైల్డ్ కార్డుగా హౌస్ లోకి అడుగు పెట్టిన శివ కుమార్…

Big Stories

Advertisement
×