Dharur SI: స్వేచ్చ బ్యూరో: న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తనపై ధరూర్ ఎస్‌ఐ విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వీరేష్ ఆరోపించారు. పోలీసుల తీరుతో అవమాన భారంతో తీవ్ర మనస్థాపానికి గురైన తాను నిషేధిత పురుగుల మందు సేవించడంతో ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో అనేక సార్లు వేధిస్తున్నారంటూ ఆరోపించారు.
బాధితుడు వీరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో బూరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసినప్పటి నుంచి తనపై కక్ష పెంచుకున్నారని ఓ కేసు విషయమై ధరూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో తనను రాజకీయ కక్షతో వివిధ రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయాడు. పోలీస్‌స్టేషన్‌లో తనను అవమానించి, దాడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై గద్వాల ఖలీల్ ఫర్టిలైజర్ లో నిషేధించబడిన ఆన్ క్వాట్ అనే నిషేధిత పురుగుల మందును కొనుగోలు చేసి అట్టి పురుగుల మందును సేవించి ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
Also read: గోవాలో హోరెత్తిన ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’.. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి!
అధికార బలం, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే న్యాయం జరుగుతోందని, ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వెళ్లినా న్యాయం పొందలేకపోతున్నారని వీరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గుతున్నారంటూ ఆరోపించాడు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సామాన్యులను బెదిరించడం, ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నాడు.
ఈ ఘటనపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, తనకు జరిగినట్లు ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని బాధితుడు వీరేష్ డిమాండ్ చేశాడు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే సామాన్యులకు భద్రత, న్యాయం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నాపై అకారణంగా దాడి చేసి బెదిరింపులకు గురి చేసిన ధరూర్ ఎస్సై పై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో మల్దకల్ మండలంలో మైనర్ బాలికను పోలీస్ స్టేషన్ కు పిలిపించడంతో సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రస్తుత ధరూర్ ఎస్సై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
Also read: ‘ఏందయ్యా సామి’ తర్వాత ‘కోబలి’.. ఈసారి రచ్చ మామూలుగా లేదుగా !