E-Paper
Advertisement

వైల్డ్ కార్డ్స్ కాదు వైల్డ్ ఫైర్.. హౌస్ లోకి అడుగుపెట్టిన స్టార్స్ వీరే!

వైల్డ్ కార్డ్స్ కాదు వైల్డ్ ఫైర్.. హౌస్ లోకి అడుగుపెట్టిన స్టార్స్ వీరే!
Advertisement

Bigg Boss 10:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తొమ్మిది సీజన్లు పూర్తికాగా , ఇప్పుడు పదవ సీజన్ కూడా ఐదు వారాలు నేటితో పూర్తి కాబోతున్నాయి. అందులో భాగంగానే తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ఆడియన్స్ కు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఇస్తున్న నేపథ్యంలో వైల్డ్ కార్డ్స్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ నాగార్జున చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది.

వైల్డ్ కార్డు ఎంట్రీస్..

ఇప్పటికే పదిమంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ తో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమైంది. మధ్యలో ఇద్దరు కామనర్సు వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు. ఇప్పటికే చైత్ర, కృష్ణుడు, మిథిలేష్, సృష్టి, అపూర్వ ఎలిమినేట్ అయ్యారు. మరొకవైపు వైల్డ్ కార్డు ద్వారా ఐదు మంది హౌస్ లోకి అడుగుపెట్టడం షోపై మరింత ఆసక్తిని కలిగిస్తుంది . ఇక వైల్డ్ కార్డు ఎంట్రీస్ లో భాగంగా మొదటి కంటెస్టెంట్ గా ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ కుమార్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఆయన ఎంట్రీ తోనే బైకుపై హౌస్ లోకి అడుగుపెట్టడం చాలా కొత్తగా అనిపించింది .మంచి వైబ్ తో ఆయనను మిగతా కంటెస్టెంట్స్ ఆహ్వానించారు.

హౌస్ లోకి అడుగుపెట్టిన వారు వీరే..

Advertisement

ఇక మిగిలిన వారి విషయానికి వస్తే.. నీతూ, దక్ష గుత్తికొండ, కామనర్ నవరసాలు రామకృష్ణ , శ్వేతా నాయుడు హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టినట్లు చూపించారు. ఇకపోతే అపూర్వ , మిథిలేష్ లతో పాటే రామకృష్ణ హౌస్ లోకి రావాల్సి ఉండగా.. మిథిలేష్ ,రామకృష్ణ మధ్య జరిగిన పోటీలో మిథిలేష్ గెలిచి హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు మళ్లీ రామకృష్ణ హౌస్ లోకి అడుగుపెట్టడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

also read:చిరంజీవి మూవీని వదులుకున్న బాలయ్య కూతురు!

అందరి టార్గెట్ శాలినినే..

Advertisement

ఇకపోతే ఈ వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చి రాగానే శాలిని, చరణ్ లను టార్గెట్ చేస్తూ ఆట కనిపించడం లేదు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి మరి వైల్డ్ కార్డ్స్ కాదు వీళ్ళు వైల్డ్ ఫైర్ అనే రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన హోస్ట్ నాగార్జున షో పై మరింత క్యూరియాసిటీ పెంచేసారు. మరి వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో హౌస్ లో ఇంకెలాంటి ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి లభించబోతుందో తెలియాల్సి ఉంది.

Related News

బిగ్‌బాస్ టైటిల్ అతను గెలిస్తే హ్యాపీ.. మహేష్ అచంట మనసులో మాట!

ఆరుగురిని లవ్ చేశా.. నా భార్యకు చెబితే .. మహేష్ అచంట లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

వాళ్లని చూస్తే కంకర రాళ్లతో కొట్టాలనిపిస్తుంది…చిరు పై మహేష్ అచంట వైరల్ కామెంట్స్

బిగ్‌బాస్‌కు వెళ్లకపోవడానికి కారణం ఇదేనా? మహేష్ అచంట ఏమన్నారంటే!

జబర్దస్త్ కార్యక్రమం పై మహేష్ అచంట కామెంట్స్.. రెండు రోజులు పని చేస్తే చాలంటూ!

నా డైలాగ్స్ అంటే మహేష్ బాబుకి పిచ్చ ఇష్టం.. రంగస్థలం మహేష్ కామెంట్స్ వైరల్!

ఫస్ట్ వైల్డ్ కార్డుగా హౌస్ లోకి అడుగు పెట్టిన శివ కుమార్…

Big Stories

Advertisement
×