E-Paper
Advertisement

టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ.. 2027లో రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు!

టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ.. 2027లో రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు!
Advertisement

Nexon EV Rivals: భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో టాటా నెక్సాన్ ఈవీకి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే, త్వరలో ఈ విభాగంలో పోటీ మరింత పెరగనుంది. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్, దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్.. రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 2027 మార్చి నాటికి ఈ రెండు మోడళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

విన్‌ఫాస్ట్ VF5.. రూ.12 లక్షల ధరతో వచ్చే అవకాశం..

వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ సంస్థ భారత మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే తమిళనాడులో స్థానిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా VF5 ఎలక్ట్రిక్ క్రాసోవర్‌ ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని ధర సుమారు రూ.12 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.

Advertisement

అంతర్జాతీయ మార్కెట్లలో VF5 రెండు LFP బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అవి 29.6 kWh, 37.23 kWh బ్యాటరీ ప్యాక్‌లు. వీటి ఆధారంగా 90 hp నుంచి 136 hp వరకు పవర్ లభిస్తుంది. గరిష్టంగా 135 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 నుంచి 300 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వవచ్చని అంచనా. అయితే, భారత వెర్షన్‌ లో బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇంకా ఖరారు కాలేదు.

VF5 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా విన్‌ఫాస్ట్ పరిచయం చేయనుంది. ఇందులో V ఆకారపు ఫ్రంట్ డిజైన్, సన్నని హెడ్‌ ల్యాంప్స్, కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్, 16 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. క్యాబిన్‌లో పెద్ద టచ్‌స్క్రీన్, డ్యూయల్ టోన్ లెదరెట్ సీట్లు, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ ఏసీ లాంటి ఫీచర్లు ఉండవచ్చు. భద్రత కోసం 6 ఎయిర్‌ బ్యాగులు, ESP, HAC, లెవల్ 2 ADAS లాంటి సదుపాయాలు అందించే అవకాశం ఉంది.

హ్యుందాయ్ ఐయోనిక్ P.. 2027 తొలి క్వార్టర్ లో విడుదల

Advertisement

హ్యుందాయ్ కూడా HE1i అనే కోడ్‌ నేమ్‌ తో కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. దీనిని ఐయోనిక్ P పేరుతో విడుదల చేయవచ్చని సమాచారం. 2027 మొదటి త్రైమాసికంలో ఈ మోడల్‌ ను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. హ్యుందాయ్ ఇండియా లైనప్‌ లో ఇది క్రెటా ఎలక్ట్రిక్ కంటే దిగువన స్థానం పొందనుంది.

ఈ కారును తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. స్థానికంగా విడిభాగాల తయారీ పెరగడం వల్ల ధరను పోటీగా నిర్ణయించే అవకాశం ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 42 kWh, 49 kWh ఆప్షన్లు ఉండవచ్చని అంచనా. ఇవి హ్యుందాయ్ ఇన్‌స్టర్ EVలో ఉన్న బ్యాటరీ సామర్థ్యాలు. అయితే, ఐయోనిక్ Pలో ఇదే బ్యాటరీలు ఉంటాయా? లేదా? కియా సైరోస్ EVతో పవర్‌ ట్రెయిన్‌ ను పంచుకుంటుందా? అనేది ఇంకా స్పష్టత లేదు.

నెక్సాన్ ఈవీకి పెరగనున్న పోటీ

హ్యుందాయ్ కొత్త ఈవీలో ప్లియోస్ కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్, పవర్డ్ సీట్లు, ఆటోమేటిక్ ఏసీ, లెవల్ 2 ADAS లాంటి ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ రెండు కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తే టాటా నెక్సాన్ EVతో పాటు మహీంద్రా XUV 3XO EV, కియా సైరోస్ EVలకు కూడా పోటీ పెరగనుంది.

Read Also: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా సంచలనం.. ఎంజీ విండ్సర్‌కు పోటీగా కొత్త ఈవీ

Tags

Related News

SMK నుంచి అదిరిపోయే హెల్మెట్.. స్పెషల్ ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా సంచలనం.. ఎంజీ విండ్సర్‌కు పోటీగా కొత్త ఈవీ

కొత్త లుక్‌లో హీరో డెస్టిని 110.. క్లాసిక్ ఎడిషన్ ధర ఎంతంటే?

దక్షిణాఫ్రికాలో టాటా పంచ్ రిలీజ్.. భారత్‌తో పోలిస్తే ధర ఎక్కువా? తక్కువా?

ఈవీ మార్కెట్‌లో హీరో విడా దూకుడు.. 2026లో 2 లక్షలు దాటిన అమ్మకాలు!

దీపావళి స్పెషల్ ఆఫర్స్.. ఈ 5 సెడాన్ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు!

దీపావళి సీజన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈ 5 కార్లపై లక్షల్లో తగ్గింపు!

Big Stories

Advertisement
×